-అనాధులను ఆదుకునేందుకు మార్పు స్పూర్తిదాయకం..
-దివ్యాంగ విద్యార్థినిలకు దుస్తుల పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు పునరావాస కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అన్నమ్మ దివ్యాంగుల పాఠశాల సంఘటన పునరావతం కాకుండా చర్యలు తీసుకున్నామని మార్పు స్వచ్చంద సంస్థను స్పూర్తిగా తీసుకుని ఆనాధులను ఆధుకునేందుకు మందుకు రావాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అన్నారు. గుణదల విజయమేరీ బ్లయిండ్ స్కూల్‌లో పునరావాసం పొందుతున్న ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలకు చెందిన విద్యార్థులతో శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ ముచ్చటించి వారిలో ఉత్సహాన్ని నింపి మార్పు స్వచ్చంద సంస్థ సహకారంతో దుస్తులను పంపిణీ చేశారు. తల్లిదండ్రులకు దూరమై దివ్యాంగులుగా జీవనం కొనసాగిస్తున్న చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం దురదృష్టకరమన్నారు. అంకిత భావంతో కన్నబిడ్డలవలే అక్కునచేర్చుకోవాల్సిన వారే అసభ్యంగా ప్రవర్తించడం నీచాతినీచమన్నారు. జరిగిన సంఘటన పై కేసు నమోదు చేసి విచారణ అనంతరం నింధుతులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇటివంటి సంఘటనలు పునరావాసం కాకుండా అన్ని వసతి గృహాలు, పునరావాస కేంద్రాలపై గట్టి నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, శిశుసంక్షేమం, చైల్డ్‌లైన్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాలలు చైల్డ్ లైన్ నెంబర్ 1098, పోలీస్ 100, మహిళాహెల్ప్‌లైన్ 181 ఎస్‌వోఎస్‌కి కాల్ చేసి సహాయం పొందడంతోపాటు, అసౌకర్యంగా ఉన్న పిల్లలు సమీపంలో ఉన్న బందువులు, పెద్దల సహాయం తీసుకునేలా ‘‘అరవండి` పరిగెత్తండి` చెప్పండి పోస్టర్లు ‘‘గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్’’ల మధ్య వ్యత్యాసంపై రూపొందించిన వీడియో ద్వారా చైతన్యవంతులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కళాశాలల తరగతి గదులలో స్కూల్, కళాశాలల బస్సులలో, విభిన్నప్రతిభావంతులకు ఆశ్రయం ఇస్తున్న వసతి గృహాలు, విద్యార్థులు, ఉద్యోగల వసతి గృహాలలోను స్పెషల్ చిల్డ్రన్ హోమ్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయలు, ఎగ్జిబిషన్, బస్టాండ్, రైల్యేస్టేషన్‌లు షాపింగ్ మాల్స్‌లలో పోస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. మార్పు స్వచ్చంద సంస్థ విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారని ఇదే స్పూర్తితో విద్యార్థులను ఆధుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. దివ్యాంగుల విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే తమ దృష్టికి తీసుకువస్తే తానే స్వయంగా భోజన ఏర్పాట్లను చేసేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ తెలిపారు.
జాయింట్ కలెక్టర్ వెంట ఐసిడిఎస్‌పిడి జి ఉమాదేవి, మార్పు స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు రావురి సూయజ్ తహాశీల్థార్ దుర్గాప్రసాద్, విజయమేరీ బ్లయిండ్ స్కూల్ నిర్వహుకులు అమల, రాజరాజేశ్వరి, ఫిలో, కల్పన, విజి తదిరతులు ఉన్నారు.