-కృష్ణలంక రాణిగారి తోట, సిమెంట్ గోడౌన్ ప్రాంతాలలో పర్యటన
-అధికారులకు పలు సూచనలు : కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ వెంకట సత్యనారాయణతో కలసి డివిజన్ పరిధిలోని కృష్ణలంక, రాణి గారి తోట, సిమెంట్ గోడౌన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల విధానము క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. పర్యటనలో స్థానిక కార్పొరేటర్ డివిజన్ పరిధిలోని పలు సమస్యలతో పాటుగా 20 వ డివిజన్ నకు సంబందించి 100, 101 వార్డ్ సచివాలయాలను మార్చుట, ఉర్దూ స్కూల్ నిర్మాణం కొరకు స్థలం ఏర్పాటు, సచివాలయం, స్వయం సహాయక సంఘాల వారు సమావేశాలు నిర్వహించుటకు వీలుగా రూమ్ ఏర్పటు మరియు 108 వారికీ ఆఫీస్ రూమ్ కేటాయించుట మరియు తాడికొండ సుబ్బారావు ఎలిమెంటరీ స్కూల్ దారి ఏర్పాటు చేయు అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చిన సందర్బంలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు.
అదే విధంగా డివిజన్ పరిధిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పైపు లైన్ పనులను వేగవంతము చేయుటతో పాటుగా డివిజన్ పరిధిలో సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులను కూడా సత్వరమే చేపట్టునట్లుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో గల పార్క్ నిర్వహణ మరియు పార్క్ నందు చిన్నారులకు అందుబాటులో గల ఆట పరికరాలు మొదలగు అంశాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్లు చంద్ర శేఖర్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.