Breaking News

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలవైపు జగన్‌ సర్కారు అడుగులు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-29వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్లలో పేద‌ల జీవితాలు ఎంతగానో మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం 29 వ డివిజన్ 210 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 523 గడపలను సందర్శించి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతీ ఒక్క పథకాన్ని పారదర్శకంగా ఎప్పుడు, ఏ నెలలో అమలు చేస్తున్నారో ముందుగానే స్పష్టంగా ప్రకటిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నిరంతరం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత తెలుగుదేశం హయాంలో అర్హత ఉన్నా రాజకీయ సిఫార్సులు లేకపోవడంతో అనేక మంది ప్రభుత్వ పథకాలను దూరమయ్యారని గుర్తుచేశారు. అటువంటి విధానానికి స్వస్తి పలికి.. కేవలం అర్హత మాత్రమే ప్రాతిపాదికన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పథకాల అమలులో సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 31 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అదే చంద్రబాబు హయాంలో కనీసం స్థలాలు కూడా లేకుండా టిడ్కో ఇళ్ల పేరిట పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. కేవలం కాగితాలకే ఇళ్లను చూపి.. ఒక్కో లబ్ధిదారుని వద్ద రూ. 50 నుంచి రూ. లక్ష వరకు అప్లికేషన్ల రూపంలో దోచుకున్నారని ఆరోపించారు. ఇందులో 6,576 ఇళ్లు 50 శాతం కూడా పూర్తికాలేదని.. 5,341 మందికి కనీసం స్థలం కూడా చూపలేదన్నారు. అయినా కూడా నగరంలో 11,917 మందికి ఆర్డర్ కాపీలను ఇచ్చారని దుయ్యబట్టారు. గత చంద్రబాబు ప్రభుత్వం మోసగించిన టిడ్కో లబ్ధిదారులకు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తి న్యాయం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 897 మంది లబ్ధిదారుల ఖాతాలలో రూ. 3 కోట్ల 6 లక్షల 12 వేల 5 వందల నిధులు జమ చేసినట్లు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టకుండా వదిలేసిన టిడ్కో ఇళ్లను రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలు వంటి అన్ని హంగులతో పూర్తి చేసి డిసెంబర్ 21 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన‌రోజున పేదలకు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. తొలి రెండు డోసులను పూర్తిచేసుకున్న ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. హెల్త్ సెంటర్లకు రాలేని పరిస్థితిలో ఇంటి వద్దనే వారికి వ్యాక్సిన్ అందించేలా ఆరోగ్య మిత్రలు, హెల్త్ సెక్రటరీలు చొరవ చూపాలన్నారు.

మహానేత వైఎస్సార్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు
గడప గడపకు మన ప్రభుత్వం పర్యటనలో భాగంగా డివిజన్లో పలువురు నిరుపేదలకు ఉపాధి నిమిత్తం మల్లాది వేంకట సుబ్బారావు ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. సమాజ సేవను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మన ఎదుగులలో కీలక పాత్ర పోషించిన సమాజానికి తిరిగి సేవ చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అప్పుడే సమాజాభివృద్ధి సాధించడానికి వీలు అవుతుందని పేర్కొన్నారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు ‘మల్లాది వేంకటసుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా తన వంతు కృషి చేస్తున్నట్లు ఈసందర్భంగా మల్లాది విష్ణు తెలియజేశారు. ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ల పంపిణీ, హెల్త్ క్యాంపులు, కుట్టు మిషన్లు, ప్లాట్ ఫామ్ రిక్షాలు, తోపుడు బండ్లు, ఇస్త్రీ పెట్టెలు, క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనా సమయంలోనూ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా ఆహారం, మందులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లోనూ ఈ సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు జనతా పార్టీ
సోమువీర్రాజు వ్యవహార శైలి చూస్తుంటే ఆయన రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడో..? లేక టీడీపీ బీ టీమ్‌ కు అధ్యక్షుడో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. టీడీపీతో కలిసి ఉండటం వల్లనే బీజేపీ సర్వనాశనం అయిందని గతంలో అనేక సార్లు విమర్శించిన సోము వీర్రాజు.. చంద్రబాబు దార్శనికుడు అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. మీ తెరచాటు బంధాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని చెబుతూనే.. మరోవైపు ఏ ముఖంగా పెట్టుకుని విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత ప్రజలు నిలదీసినా బీజేపీ నేతలకు బుద్ది రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించిన పాలన వికేంద్రీకరణను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చూపుతున్నారని.. అయినా నరం లేని నాలుకతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాదని.. చంద్రబాబు జనతా పార్టీ మాత్రమేనని మల్లాది విష్ణు విమర్శించారు. సోమువీర్రాజుకు నిజంగా ధైర్యం ఉంటే టీడీపీ-బీజేపీ మధ్య తెరచాటు బంధం లేదని బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంతేగానీ బీజేపీలో ఉంటూ చంద్రబాబు కనుసన్నల్లో పనిచేయడం మానుకోవాలని హితవు పలికారు. నీతిఆయోగ్ సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారని.. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే న్యాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించే అంశాలపై సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, వైసీపీ నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు గుండె సుందర్ పాల్, ఇసరపు రాజా రమేష్, బంకా భాస్కర్, భోగాది మురళి, కంభం కొండలరావు, కోలా రమేష్, వేణు, ప్రభాకర్, పూర్ణిమ, దేవినేని సుధాకర్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *