Breaking News

ఆత్మస్థైర్యం చదవాలన్న పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు
-దివ్యాంగ విద్యార్థి ఆర్జీపై జిల్లా కలెక్టర్‌ హృదయ ‘‘స్పందన’’
-జిల్లా కలెక్టర్‌ చొరవతో విద్యాంగ విద్యార్థి దగ్గరకే దిగివచ్చిన తరగతి గది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆత్మస్థైర్యం చదవాలన్న పట్టుదల ఉంటే జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చునని ప్రదీప్‌ పట్టుదల దివ్యాంగులకు స్పూర్తిదాయకమని తన చదువుకు ఆటంకం కలకుండా తానే సమస్యను పరిష్కరించుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో దివ్యాంగ విద్యార్థి ప్రదీప్‌ ఆర్జీపై జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు స్పందించిన తీరు పట్ల ప్రశంసలు వెల్లువిరిసాయి. విజయవాడ ప్రకాష్‌నగర్‌కు చెందిన దివ్యాంగ విద్యార్థి మేకల ప్రదీప్‌ తన తల్లి మేకల ఉమామహేశ్వరితో స్పందన సమావేశ మందిరానికి వచ్చి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఆర్జీని సమర్పిస్తూ తాను ప్రకాష్‌ నగర్‌లో నివసిస్తున్నానని తాను జన్యులోపంతో పుట్టుకతోనే రెండు కాళ్ళులో బలం లేక నడవలేని స్థితిలో భాదపడుతున్నానని నడవాలని ప్రయత్నించి ఆరు సార్లు పడిపోయి కాళ్ళకు దెబ్బలు తగిలి సజ్జరీ కూడా చేయించుకోవడం జరిగిందని అయినప్పటికి చదువుపై ఉన్న ఆశక్తితో ఐదో తరగతి వరకు చదివానని తెలిపారు. నాకు బాగా చదువుకుని కీిళ్ళ డాక్టర్‌ అవ్వాలని కోరికగా ఉందని జిల్లా కలెక్టర్‌కి వివరిస్తూ నేను ఆరవ తరగతి చేరేందుకు ఇబ్బందిగా ఉందని ప్రభుత్వ పాఠశాలల చేరాలని ప్రయత్నిస్తే ఆరవ తరగతి గది మొదటి అంతస్థులలో ఉండటం వలన తనను చేర్చుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారని తెలిపారు. దయచేసి నా సమస్యను పరిష్కరించి నేను చదువుకునే మార్గం చూపించి నా కోరిక నేరవేర్చాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ప్రదీప్‌ తల్లి ఉమామహేశ్వరి మాట్లాడుతూ నా భర్త తాగుడికి బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నపట్టికి తాను కూలీ పనులు చేస్తూ దివ్యాంగుడైన కుమారుడుని చదివించుకుంటన్నానని తెలిపింది. తన కుమారుడుని ఆరవ తరతగి చేర్పించేందుకు పాఠశాలకు వెళ్లితే మెట్లు ఎక్కలేడని చేర్చుకోవడం లేదని తెలిపింది.
ఆర్జీని అందుకుంటూ ప్రదీప్‌ను అతనికి చదువుపై ఉన్న ఆశక్తి పై చలించిన జిల్లా కలెక్టర్‌ స్పందిస్తూ వెంటనే జిల్లా విద్యా శాఖ అధికారి సివి రేణుకను పిలిచి వెంటనే ప్రకాష్‌నగర్‌ సమీపంలోని ఎల్‌బిసి నగర్‌ పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్‌ పాఠశాలలో మొదటి అంతస్థు గదిలో నిర్వహిస్తున్న ఆరవ తరగతి సెక్షన్‌ను కింద గదికి మార్చేలా చర్యలు తీసుకుని ప్రదీప్‌కు ఆరవ తరగతిలో విద్య బోదన అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమెను ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థి ప్రదీప్‌తో జిల్లా కలెక్టర్‌ ముచ్చటిస్తూ నిన్ను చూసి నాకు ఎంతో ఆనందంగా ఉందని నీకు చదువు పట్ల ఉన్న ఆసక్తి ప్రతి విద్యార్థికి ఆదర్శప్రాయమన్నారు. సమస్యను సాధించుకోవాలన్న పట్టుదల ఆత్మస్థైర్యం దివ్యాంగులకు అడ్డురాదని నిరూపించుకున్నావన్నారు. నీకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని ఉన్నత చదువులు అభ్యసించేవరకు అనుకూలమైన విధంగా విద్య బోదన అందించేలా చర్యలు తీసుకుంటానని డాక్టర్‌ కావాలన్న కోరికను నెరవేర్చుకుని నీలాంటి దివ్యాంగులకు వైద్య సహాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రదీప్‌ భుజంతట్టి ప్రోత్సహించారు.
స్పందన కార్యక్రమంలో 81 అర్జీలు నమోదు అయ్యాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ 26, యంఏయుడి 12, విద్య 6, సర్వే అండ్‌ సెటిలిమెంట్‌ 2, పోలీస్‌ 7, డిపివో 2, వైద్య 6, మిగిలిన వివిధ శాఖలకు చెందినవి 20 ఉన్నాయని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ కుమార్‌, డిఆర్‌వో కె.మోహన్‌ కుమార్‌, డ్వామా పిడి జె. సునీతలు వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *