Breaking News

2023 విద్యా సంవత్సరానికి వైద్య కళాశాల సిద్ధం కావాలి

-ఎమ్మెల్యే పేర్నినానితో ఫోన్లో సంబాషించిన ముఖ్యమంత్రి
-మచిలీపట్నం మెడికల్ కళాశాల నిర్మాణ పనులపై ఆరా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వీలైనంత త్వరగా మచిలీపట్నం వైద్య కళాశాల పెండింగ్ పనులను పూర్తి చేయాలని ,ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం 150 మంది విద్యార్థినీ విద్యార్థులు 2023 సెప్టెంబర్ అకాడమిక్ సంవత్సరం నుంచి మచిలీపట్నంలో మెడిసిన్ చదువుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన దృఢ నిశ్చయాన్ని తెలిపారు.
గత నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం నేరుగా ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గూర్చి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీరు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
పరామర్శ అనంతరం, మచిలీపట్నంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణపు పనులు వేగంగా జరుగుతున్నాయా ? అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్ని నానిను అడిగితెలుసుకొన్నారు. 2023 విద్యా సంవత్సరానికి తగిన విధంగా అన్ని వసతులు ఏర్పాటు అయ్యేలా పర్యవేక్షించి, ఆయా నిర్మాణ సంస్థ నుంచి త్వరితగతిన వైద్య కళాశాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. మీ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడగానే ఈ పనులలో నిమగ్నమై ఉండాలన్నారు.
వచ్చే విద్యా సంవత్సరానికి ఎట్టి పరిస్థితులలో మచిలీపట్నం వైద్య కళాశాల సిద్ధం కావాలని మరోమారు నొక్కిచెప్పారు. మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్మితమవుతున్న భవనాలలో ఏదైనా సాంకేతికపరమైన లోపం లేదా అనవసర జాప్యం ఉంటే నేరుగా తన దృస్టకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎమ్మెల్యే పేర్ని నానికి సూచించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *