Breaking News

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-28వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యేమల్లాదివిష్ణు అన్నారు. మంగళవారం 28 వ డివిజన్ 212 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్అవుతు శ్రీశైలజారెడ్డి, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, పార్టీ శ్రేణులతో కలిసి రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ 3వ లైన్ నుంచి 6వ లైన్ వరకు విస్తృతంగా పర్యటించారు. 412 గడపలను సందర్శించి లబ్ధిదారులతో మమేకమయ్యారు. ప్రతి ఒక్క గడపకు అందించిన సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా లబ్ధిదారులకు వివరించారు. పింఛన్లు సకాలంలో అందుతున్నదీ లేనిది వయో వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, లాయర్లు, అధికారులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. వీటన్నింటిపై యాక్టన్ టేకెన్ రిపోర్టును సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. మెరుగైన పాలనకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై పలు ఫిర్యాదులు అందడంతో.. సమస్యల పరిష్కారానికి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. అలాగే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆశావర్కర్లు, హెల్త్ సెక్రటరీలకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారాలు మానుకోవాలి
పాలనలో ఎప్పటికప్పుడు నూతన విధానాలకు శ్రీకారం చుడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నాడు చంద్రబాబు చీకటి పాలనకు, నేడు జగనన్న జనరంజక పాలనకు మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. వ్యాక్సినేషన్ సహా ప్రజలకు సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంభించే విధానాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కగా వివరించడం జరిగిందన్నారు. తమకు వస్తున్న మంచిపేరుని చూసి జీర్ణించుకోలేక టీడీపీ, బీజేపీ బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు అభ్యంతరకరమని.. ఆయన మాటలు మత్రిభ్రమించినట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై పెట్టిన తప్పుడు కేసులకు అసలు కేంద్ర బిందువు చంద్రబాబు అని విమర్శించారు. ప్రజలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి  వస్తున్న అశేష ఆదరణను చూసి తట్టుకోలేకే నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పన్నిన కుట్రలో భాగంగా తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. అసలు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాశనం చేసిన వ్యవస్థలకు సీఎం జగన్‌ రిపేర్‌ చేస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మరోవైపు నిష్పక్షపాతంగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను అభినందించవలసిందిపోయి బీజేపీ నాయకులు శోకాలు పెడుతున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. సచివాలయ వ్యవస్థ అందిస్తున్న సేవలను ఓవైపు కేంద్ర ప్రభుత్వం కీర్తిస్తుంటే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులు మాత్రం విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా సోమువీర్రాజు తెరపైకి వచ్చి మాట్లాడుతున్నారని.. ఇకనైనా తెరవెనుక రాజకీయాలు, ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.

మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
రెండు రోజుల పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాల పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి అడుగులో ప్రజల ఆప్యాయత, మద్దతు కనిపిస్తోందన్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వంలోనూ తాము ఇంతగా లబ్ధి పొందలేదని పెద్ద సంఖ్యలో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయ పరిధిలో ప్రతిఒక్కరికీ పేరుపేరున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ (ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(యుజిడి) రామకృష్ణ, వైసీపీ కార్పొరేటర్లు పెనుమత్స శిరీష సత్యం, బాలి గోవింద్, నాయకులు కగ్గా పాండు, కమ్మిలి రత్న, వేదాంతం చైతన్య, చిన్నారావు, సూరిబాబు, గుండె సుందర్ పాల్, భోగాది మురళి, లక్కంరాజు సునీత, త్రివేణి రెడ్డి, నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో భాధ్యతతో విధులు నిర్వహించాలని, రోడ్లు, డ్రైన్ల ఆక్రమణలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *