Breaking News

స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో దేశ సమగ్రతకు భాగస్వామ్యం కావాలి…

-ప్రతీ ఒక్కరూ జాతీయత భావాన్ని పెంపొందించుకోవాలి…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర సమరయోధుల స్పూర్తితో దేశ సమగ్రత సమైఖ్యత ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు.
అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు శాఖ (ఏపిఆర్‌టిసి) సంముక్త ఆధ్వర్యంలో పండిటి నెహ్రు బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయెధుడైన పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రు పేరున ఉన్న బస్‌స్టేషన్‌లో స్వాతంత్య్ర ఉద్యమ కారుల స్పూర్తిదాయక ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎందరో మహనుబావుల త్యాగఫలం నేటి మన స్వేచ్చకు మూలధనం అన్నారు. అమరవీరులు అందించిన స్వాతంత్య్రం ద్వారా మనమందరం స్వేచ్ఛ జీవనాన్ని కొనసాగిస్తున్నామన్నారు. అటువంటి త్యాగమూర్తులను స్మరించుకుంటూ దేశ సమగ్రత సమైఖ్యతకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాల్సివుందన్నారు. సుదీర్ఘ పోరాటం వలన మనం సంపాదించుకున్న స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకునేలా ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలన్నారు. పేదరికం నిరక్షరాస్యత అవినీతి అసమానతలను రూపుమాపడం మనఅందరి కర్తవ్యం అని అన్నారు. మహత్మాగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రు సర్థార్‌వల్లబాయిపటేల్‌ భగత్‌సింగ్‌, లాల్‌ బహుదూర్‌ శాస్త్రీ, రaన్సీలక్ష్మిబాయి, సరోజని నాయుడు, అల్లూరి సీతారామరాజు, పింగళివెంకయ్య, పోట్టి శ్రీరాములు వంటి అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులకు భరత మాత పై ఉన్న ప్రేమ భక్తి భావాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుకోవాలన్నారు. స్వాతంత్య్ర సమరంలో కీల పాత్ర పోషించి అసువులు బాసిన అల్లూరి సీతారామరాజుకు దేశవ్యాప్తంగా సరైన గుర్తింపు లభించేలా ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల రాష్ట్రంలోని భీమవరంలో ఆ మహనీయుడిని కాంస్య విగ్రహాన్ని అవిష్కరించడం జరిగిందన్నారు. అలాగే జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కీర్తిని నలుదిశల చాటిచెప్పేలా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించి ప్రతి వ్యక్తి ఆయనను స్మరించుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కలిసి వారిని ఘనంగా సత్కరించడం జరిగిందన్నారు.అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 2 తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లాలో పలు కార్యక్రమాలను నిర్వహించి ప్రజలలో దేశభక్తి భావాన్ని నింపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 13,14,15 తేదీలలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను చైన్యతవంతులను చేస్తున్నామన్నారు. పండిట్‌ నెహ్రు బస్‌స్టేషన్‌కు రాష్ట్రం నలుమూలల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి నిత్యం వేలాదిమంది ప్రయాణీకులు రాకపోకలు జరుపుతారన్నారు. అటువంటి ప్రదేశంలో స్వాతంత్య్ర సమరయోధుల ఘట్టాలను ప్రజలకు తెలియజేసేలా ఫోటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఏపిఆర్‌టిసి రీజనల్‌ మేనేజర్‌, సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అభినందించారు.
కార్యక్రమంలో జిల్లా పబ్లిక్‌ రవాణా అధికారి వైయం దానం, డిప్యూటి ఛీప్‌ ట్రాఫీక్‌ మేనేజర్‌ బషీర్‌ అహ్మద్‌,డిప్యూటి సిటివో జాన్‌ సుధాకర్‌, అసిస్టెంట్‌ ట్రాఫీక్‌ మేనేజర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారులు యు సురేంద్రనాద్‌, ఎస్‌వి మోహన్‌రావు, ఎవిఎస్‌ ఏ.సాయిబాబా, వి.వి.ప్రసాద్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *