-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు.
-రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు 7 కోట్ల 12లక్షల 35వేల రూపాయలు లబ్ది…
-శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరండల్ పేట లెనిన్ సెంటర్ అంబేద్కర్ భవన్‌లో మంగళవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, నగరపాలక సంస్థ డిప్యూటి మేయర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు హాజరై జ్వోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నెలలో ఒకసారి ఆదివాసిల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేసున్నామని, గిరిజనులు ప్రతీ ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధికి రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గిరిజనులు కూడా తమ ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. తమ తోటి గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంటే తాము కూడా అభివృద్ధి చెందాలని దృక్పథం వారిలో రావాలన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నెలకొకసారి గిరిజనుల సంక్షేమపై ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఐఏఎస్ ఐసీఎస్‌లు తొలి పోస్టింగ్ ట్రైబల్ ఏరియాలో చేయవలసి ఉంటుందన్నారు. దానివల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెగల అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలుగుతుందని కలెక్టర్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం తనుకుందన్నారు. దాదపు నాలుగు సంవత్సరాలు నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రల్లోని మారుమూల గిరిజన ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉందని కలెక్టర్ అన్నారు. తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అన్నారు. జిల్లాలో ఎరుకుల, యానాదుల, చెంచులు నక్కల తదితర తెగలకు చెందిన వారికి జగనన్న కాలనీలలో పట్టాలు మంజూరు చేశామని అయితే అర్హత ఉండి పట్టాలు పొందని వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గిరిజన హక్కులపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రపంచవ్యాప్తంగా గిరిజన తెగలు వృద్ధిలోకి వచ్చి ఇతర జాతుల వలె అభివృద్ధిలో పోటిపడుతున్నారని కలెక్టర్ అన్నారు. చరిత్రలో ఏకలవ్య ధర్మరాజు వంటి ఎంతో మంది మహనీయులు గిరిజన తెగకు చెందినవారని ఆ మాహనీయులను స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు స్వయం సహాయక సంఘాలలో గ్రూపులుగా ఏర్పాడి స్వచ్చంద సంస్థల సహకారంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ది పొందాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలతో సమానంగా గిరిజనులను కూడా శక్తివంతులుగా చేసేలా ఎన్నో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకుని గిరిజనులు స్థితిగతులు మెరుగుపచుకోవాలన్నారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని కులాలు, మతాలతో పాటు గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33,92,438 మంది గిరిజనలకు 7 కోట్ల 12 లక్షల,35వేల రూపాయలు వారి ఖాతాలకు జమ చేసి లబ్ది చేకూర్చడం జరిగిందని శాసనసభ్యులు వివరించారు. గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని దీనిలో భాగంగా శ్రీకాకుళంలో ప్రత్యేక ట్రైబల్ యునివర్సిటి గిరిజన తెగల రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. గిరిజన తెగకు చెందిన వారిని డిప్యూటి సిఎంను చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాధికారాన్ని కల్పించారన్నారు. తిరువూరు గిరిజన ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు 3 కోట్ల రూపాయలు నిధులను వెచ్చించామన్నారు. జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేయడం ద్వారా గిరిజనుల జీవన పరిస్థితులను మెరుగు పరచేలా చర్యలు తీసుకుంటున్నామని దీనికి గిరిజనుల అండ ఉండాలని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ కోరారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీ శైలజారెడ్డి, రాష్ట్ర మైనార్టి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి శ్రీకాంత్, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి యం రుక్మాంగదయ్య, గిరిజన తెగల నాయుకులు పాల్గొన్నారు.