విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబరు 15న మహాలయ పిండప్రదానం యాత్ర, స్వదేశ్ దర్శన్ పర్యాటక ప్రత్యేక రైలును ఐఆర్సిటిసి హైదరాబాద్ ఆధ్వర్యంలో నడపనున్నట్లు సంస్థ డీజీఎం డి.ఎస్.జి.పి.కిషోర్ తెలిపారు. బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్సిటిసి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్యాకేజీ వివరాలను ఆయన తెలిపారు. 5 రాత్రులు, 6 పగటి వేళలతో సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదగా యాత్ర సాగుతుందన్నారు. 15వ తేదీ ఉదయం 6 గంటలకు రైలు విజయవాడ చేరుకుంటుందని 20వ తేదీ తిరుగు ప్రయాణమవుతుందున్నారు. గయ, వారణాసి, ప్రయాగ సంగమం సందర్శించడం జరుగుతుందని చెప్పారు. స్లీపర్, త్రీటైర్ ఏసీ ప్రయాణం, మల్టీ షేరింగ్ ప్రాతిపదికన బడ్జెట్ నాన్ ఏసీ హోటల్లో రాత్రి బస, ఉదయం టీ, కాఫీ, అల్పాహారం, భోజనం, రోజుకు లీటరు తాగునీరు, రైల్లో ఎస్కాట్, భద్రత సంస్థ కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యం అందుబాటులో ఉంది. టికెట్ ధర స్లీపర్ తరగ తిలో ఒక్కొక్కరికీ రూ.14,485, థర్డ్ ఏసీలో రూ.18,785 ఉంటుంది. మరో ప్యాకేజీలో విజయవాడ నుంచి తిరుమల, తిరుచానూరు ప్రత్యేక ప్యాకేజీలో టికెట్ ధర రూ. 3410, శిర్డీ ప్యాకేజీలో విజయవాడ నుంచి రూ. 4850 ధర ఉంటుందని తెలిపారు. టికెట్ల బుకింగ్ ఇతర వివరాలకు ఐఆర్సిటిసి వెబ్సైట్, ఫోన్ నంబర్లు 8287932312, 9701360675లో సంప్రదించాలని కోరారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …