ఉన్నత విద్యాతోనే పేదరిక నిర్మూలన సాధ్యం – దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదివేన కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యం తో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం ఉన్నతమైన చదవుల వల్లనే పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమని,అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు పట్ల వారి చదువు పట్ల అన్ని రకాలుగా భాద్యతలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. అలాగే మన తూర్పు నియోజకవర్గ పరిధిలో 5,172 మంది విద్యార్థులకు 4 కోట్ల 78 లక్షల 8 వేల 168 రూపాయల నగదు తల్లుల ఖాతాలో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఎటువంటి దళారీ విధానానికి తావులేకుండా జమ చేయడం జరిగింది అని తెలియజేసారు ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలా ఏవిధమైన ఉన్నత కోర్సులకు సంబంధించిన ఫీజుల ను ఆ సంవత్సరం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా విద్యార్థులు తల్లిదండ్రులు ఎకౌంటు లో నేరుగా జమ చేయడం జరుగుతుంది అని, గత ప్రభుత్వం హయాంలో విద్యార్థుల ఫీజులు చెల్లించక యాజమాన్యాలు రోడ్లు ఎక్కి నిరసనలు వ్యక్తం చేసే దుస్థితి అని, ఈ రోజు జగనన్న విద్యా దీవెన ఏప్రిల్- జూన్ 2022 త్రైమాసికానికి 11.02లక్షల మంది విద్యార్థులుకి 694 కోట్ల ను బాపట్ల లో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల కాతాలో జమ చేశారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యార్థులకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పధకాలలో ఎటువంటి లిమిట్స్ లేవని ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది కి పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ వర్తిస్తుంది అని, అలాగే వసతి దీవెన కింద భోజన,వసతి ఖర్చులు కింద రూ.20000 లు ఇవ్వడం జరుగుతుంది అని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థికి జగనన్న విద్య దీవెన పథకం ద్వారా ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో విద్య దీవెన అమౌంట్ జమచెయ్యబడుతున్నాయని, కరోనా ను సైతం లెక్క చేయకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం ఒక జగన్ కే చెల్లిందని, మిగులు బడ్జెట్ రాష్ట్రాల్లో సైతం కరోనా కి విలవిలాడిన పరిస్థితులు చూసామని కానీ ఎక్కడ మన రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఆగలేదని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు నిర్మలాకుమారి, ప్రవల్లిక, అంబేద్కర్, మాధురి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *