‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని విజయవంతం చేయండి…

-గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ నివాసాలలో ఆవిష్కరించటం ద్వారా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శనివారం నుండి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకాదళ కమాండ్‌కు చెందిన గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలను గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం యావత్తు ఆజాదీ కా మహోత్సవ్‌ను జరుపుకుంటున్న శుభతరుణంలో ఈరోజు గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలకు సన్మానం చెయ్యటం ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. 1971 యుద్ధంలో భారతదేశం విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్వర్ణిం విజయ్ వర్ష్’ ఉత్సవాల్లో భాగంగా రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ‘విక్టరీ జ్వాల’ను ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు.

న్యూ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సందర్శన తనకు చిరస్మరణీయమైన ఘట్టమని, తమ జీవితాలను త్యాగం చేసిన వీర యోధులకు గౌరవ సూచకంగా స్మారక చిహ్నం వద్ద వారికి నివాళి అర్పించటం తాను మరిచి పోలేనిదన్నారు. భారత జాతీయ జెండా మన ఆశలు ఆకాంక్షలను సూచిస్తుందని, అది భారతీయుల గర్వానికి చిహ్నమని గవర్నర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు కమోడోర్ వరుణ్ సింగ్, కెప్టెన్ మిలింద్ మోహన్ మొకాషి, కెప్టెన్ ఎకె తోమురోతు, కమాండర్లు శైలేందర్ సింగ్, ధీరేందర్, లెఫ్టినెంట్ కమాండర్ మను మిశ్రా ఉన్నారు. , పీటీ ఆఫీసర్లు ప్రకాష్ సింగ్, విజయ్ కుమార్ వర్మ, ఎల్ఎ అమిత్, ఎంసిఎ రమేష్ కుమార్ , రిటైర్డ్ సిబ్బంది కమోడోర్ చిన్నవీరయ్య, కమాండర్ జై ప్రకాష్, లక్ష్మణరావు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నావల్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ కమోడోర్ ఎం. గోవర్ధన్ రాజు, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కమాండర్ దినేష్ కుమార్, గవర్నర్‌ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్‌, ఉప కార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *