గవర్నర్ హరి చందన్ కు రాఖీ కట్టిన చిన్నారులు

-నిరాడంబరంగా రాజ్ భవన్ లో రక్షాబంధన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్షాబంధన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ కు చిన్నారులు రాఖీ కట్టారు. విజయవాడ రాజ్ భవన్లో అతినిరాడంబరంగా రాఖీ వేడుకను నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్ధుల వినతి మేరకు అతికొద్ది మందిని మాత్రమే రాజ్ భవన్ కు అనుమతించారు. నగరంలోని నిర్మలా ఉన్నత పాఠశాల, నల్లూరి వారి సెయింట్ మాధ్యూస్ ఉన్నత పాఠశాల, తక్షశిల ఐఎఎస్ అకాడమీకి చెందిన విద్యార్ధులు రాజ్ భవన్ కు వచ్చి గౌరవ హరించందన్ కు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గవర్నర్ చిన్నారులను పేరుపేరునా పలుకరించి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాధస్వామి ఆశీస్సులతో ఉజ్వల భవిష్యత్తును పొందాలని ఆశీర్వదించారు. గౌరవ హరిచందన్ మాట్లాడుతూ రక్షాబంధనం సోదరీ సోదరుల నడుమ ఆత్మీయతలు, అనురాగాలను ప్రతీకగా నిలుస్తుందని, తమ అనుబంధం పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ సోదర భావంతో జరుపుకునే ఈ వేడుక, ఒకరికి ఒకరు అండగా ఉంటామన్న భరోసాను కలిగిస్తుందని గవర్నర్ వివరించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *