విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనురాగాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధనం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సీతారామపురంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాఖీ పండుగ ఎంతో పవిత్రమైనదని.. సోదర సోదరీ అనుబంధానికి రక్షా బంధనం ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మానవాళి సుఖంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ ఆదర్శంగా ఉండాలని మల్లాది విష్ణు పేర్కొన్నారు. మహిళల గౌరవ మర్యాదలను కాపాడుతామని ఈ సందర్భంగా ప్రతిఒక్క సోదరుడు ప్రతిజ్ఞ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రక్షాబంధన్ స్ఫూర్తితో నవతరానికి మనమందరం ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం బ్రహ్మకుమారీలు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. తిలకం దిద్ది జ్ఞాపికను అందజేశారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో విజయాలు సాధించాలని, సమాజానికి మరిన్ని సేవలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్, బ్రహ్మకుమారీలు భారతి, మధు, మణి, కాశీరత్నం, శిరీష, కంచన, బ్రహ్మకుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …