అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దాదాపు 25 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలకుపైగా ఎంపీడీవోలు చూసిన ఎదురుచూపులను సీఎం జగన్ ప్రభుత్వం నిజం చేయడంతో వారు ఆనందానికి అవధులు లేవు. దీనిలో భాగంగా ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమకు పదోన్నతులు కల్పించినందుకు వారందరూ సీఎం జగన్‌ను సన్మానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జి.వి.నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాసరెడ్డి, కన్వీనర్ కేఎన్‌వీ ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు ఉన్నారు.
Tags amaravathi
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …