హఘర్‌ తిరంగా విజయవంతంలో భార్‌ గస్వామ్యులైన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు..

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ఘనంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేస్తున్నానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పకటనలో తెలిపారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ భాగంగా ఈనెల 13,14,15 తేదిలలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులగా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు శనివారం నగరంలో మూడున్నర కిలో మీటర్ల పొడవు జాతీయ పతాకంతో 15 వేల మంది విద్యార్థిని విద్యార్థులతో మానవహారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. బెంజ్‌సర్కిల్‌ నుండి కంట్రోల్‌ రూమ్‌ వరకు నాలుగు ప్రదేశాలలో వేదికలు ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. అంచనాలకు మించి దాదాపు 20 వేల మందికి పైగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్ని దేశభక్తిని చాటరన్నారు. హర్‌ ఘర్‌ తిరంగాలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు జోగి రమేష్‌, విడదల రజిని, నగరమేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, శాసన మండలి సభ్యులు రుహుల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు రజిత్‌బార్గవ్‌, శ్రీలక్ష్మి, బి. రాజశేఖర్‌, సురేష్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, నగర పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, ఏపి హైయర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ హేమచంద్రారెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నకల్‌ దినకర్‌ పుడ్కర్‌ ట్రాఫిక్‌ నియంత్రణ పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, పాఠశాల విద్య శాఖ కమీషనర్‌ సురేష్‌కుమార్‌, జిల్లా విద్యశాఖ అధికారిణి సివి రేణుక, ఉపవిద్యా శాఖ అధికారి రవికుమార్‌ వివిధ శాఖల అధికారులు సాంస్కృతి ప్రదర్శనలతో అలరించిన కళాకారులకు భారతమాతకు జై… అమర వీరులకు జోహార్‌… అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని వన్నె తెచ్చిన విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేస్తున్ననని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *