ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, కమీషనర్ల పనితీరుపై రౌండ్‌టేబుల్‌ సమావేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, కమీషనర్ల పనితీరుపై రౌండ్‌టేబుల్‌ సమావేశం శనివారం గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో
జరిగింది. ఈ కార్యక్రమాన్ని పప్పు దుర్గా రమేష్‌ పర్యవేక్షించగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార, కమీషనర్ల పనితీరుపై ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో 35 ప్రజాసంఘాల ప్రతినిధులు, 40 మంది ఆర్‌టిఐ యాక్టివిస్టులు వివిధ రంగాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల ప్రతినిధులతో కలసి రాష్ట్ర స్థాయిలో ఆర్‌టిఐ`జెఎసి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆర్‌టిఐ`జెఎసి ఆర్‌టిఐ కమీషనర్ల తీరుపై మరియు భవిష్యత్‌ కార్యాచరణపై పలు తీర్మానాలు, డిమాండ్లు చేయడం జరిగింది. కమీషనర్ల పనితీరు మరియు అర్హతలపై న్యాయపరంగా పోరాడతామని తీర్మానించడం జరిగింది. కమీషనర్‌ విచారణ బహిరంగంగా జరపాలని, వీడియో రికార్డింగ్‌ చేయాలని, సివిల్‌ కోర్ట్‌ ప్రోసీడిరగ్స్‌ను అనుసరించాలని డిమాండ్‌ చేయడం జరిగింది. సమాచార కమీషనర్లు దరఖాస్తుదారులను బెదిరించే ధోరణి మానుకోవాలని డిమాండ్‌ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఆర్‌టిఐ`జెఎసి కమిటీలను ఏర్పాటు చేస్తామని తీర్మానించడం జరిగింది.
విచారణ సందర్భంగా వాద, ప్రతిపాదనలను రికార్డు చేసి డ్రాఫ్ట్‌లో పొందుపరచాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆర్‌టిఐ జెఎసి కన్వీనర్‌గా పప్పు దుర్గా రమేష్‌, కో కన్వీనర్‌గా దాసరి ఇమ్మానియేల్‌, కమిటీగా కాండ్రేగుల వెంకటరమణ, హొన్నూరప్ప, బాలు అక్కిస, డాని, గుత్తి త్యాగరాజు, గొల్లపల్లి మురళీ, అలీషా, నటుకుల శ్రీనివాస్‌, సంకెళ్ళ రాంబాబు, జంపాన శ్రీనివాసగౌడ్‌, వై.శ్రీనివాసరావాఉ, బత్తిన శ్రీనివాస్‌,జయన్న, జి.శకుంతలాదేవి, వలవల రాంబాబు, టి.రవీంద్రబాబు, చంద్రమౌళి, పి.వేణుబాబు, ఎస్‌వివిఎస్‌ గోపాలకృష్ణ తోట వినోద్‌లను ఎన్నుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *