విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘మహర్షి చరక జయంతోత్సవాలు’’ సందర్భంగా విజయవాడ, బీసెంట్రోడ్లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్నందు ఇంపీకప్స్ మరియు నేషనల్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా శనివారం రాష్ట్రంలోని ఆయుర్వేద కళాశాల పిజి,యుజి విద్యార్థినీ విద్యార్థులుకు ‘‘చరక సంహిత సూత్రస్ధానం’’ శ్లోకాలు పఠనం పై పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఇంపీకప్స్ డైరెక్టర్, మరియు ప్రధానకార్యదర్శి, నేషనల్ మెడికల్ అసోసియేషన్, ఆంద్రప్రదేశ్ డాక్టర్ వేముల భానుప్రకాష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.5000లు, ద్వితీయ బహుమతి రూ.3000లు, తృతీయ బహుమతి రూ.2000లను విజేతలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన రిటైర్డ్ ప్రొఫెసర్ డా.హిమసాగరచంద్రమూర్తి, ప్రత్యేక ఆహ్వానితులు డా.నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సుధాకర్ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి సుధాకర్ మాట్లాడుతూ ఆయుర్వేదంకి మూడు సంహితలు చరక, సుశ్రుత, వాగ్భాట ప్రధానమని, అందువలన ఈరోజు చరక సూత్రస్థానం శ్లోకాలపై పఠనం పై విద్యార్థులకు పోటీ నిర్వహించడం ముదావహమన్నారు. అందుకు ఇంపీకప్స్ మరియు నేషనల్ మెడికల్ అసోసియేషన్ వారిని అభినందించారు. పోటీలో గెలుపొందిన వారికి ప్రైజ్ మనీతోపాటు సర్టిఫికెట్ను అందజేశారు. అనంతరం కిడ్నీలలో రాళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్యలపై ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …