నగర సుందరీకరణకు ప్రాధాన్యం

-రూ. 24 లక్షల వ్యయంతో మల్టీ కలర్ డెకరేటివ్ రోప్ లైటింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ సుందరీకరణలో భాగంగా నగరపాలక సంస్థ అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. దాబా కొట్ల సెంటర్ నుంచి కండ్రిక చౌరస్తా వరకు సుమారు రూ. 24 లక్షల వ్యయంతో 2.5 కి.మీ. మేర డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మల్టీ కలర్ డెకరేటివ్ రోప్ లైటింగ్ ను నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా నగరం ఇప్పటికే సరికొత్త రూపును సంతరించుకుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. వాల్ పెయింటింగ్స్, గ్రీనరీ, ప్రధాన కూడళ్ల వద్ద విద్యుద్దీపాలు, వాటర్ ఫౌంటెయిన్స్.. నగరవాసులకు ఎంతగానో ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు. ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై ఏర్పాటు చేసుకున్న రంగురంగుల విద్యుద్దీపాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే రూ. 2.50 కోట్ల వ్యయంతో ఇటీవల పూర్తిచేసుకున్న విజయవాడ – నూజివీడు ప్రధాన రహదారికి సైతం తాజాగా మల్టీ కలర్ రోప్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. దీని ద్వారా ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వేలాది మందికి రాకపోకలు సజావుగా సాగించేందుకు వీలు ఏర్పడుతుందన్నారు. అలాగే చల్లటి సాయంత్రం ఈ లైటింగ్ వ్యవస్థ ప్రయాణికులు, పర్యాటకులందరికీ ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో నియోజకవర్గంలో రూ.95.13 కోట్ల నిధులతో 73.65 కి.మీ. పొడవున రహదారుల పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో నిర్లక్ష్యానికి గురైన సింగ్ నగర్ పరిసర ప్రాంతాలను జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి కేరాఫ్ గా నిలపడం జరిగిందన్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద హైమాస్ట్ లైట్లను కూడా ప్రారంభించుకున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగిస్తామని.. రహదారులను మరింత ఆకర్షణీయంగా తీర్చదిద్దే దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ భాస్కర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, డీఈ(ఎలక్ట్రికల్) ఫణీంద్ర, ఏఈ శ్రీనివాసన్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ, ఉమ్మడి రమాదేవి, బాలి గోవింద్, డివిజన్ ఇంఛార్జిలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *