విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని పట్నాల జయరాం అడ్డూరి తమ్మారావు కత్తి రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బంగారయ్య కొట్టు సెంటర్ వద్ద నుంచి 400 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన బంగారయ్య కొట్టు చిట్టినగర్ సెంటర్ ఎర్రకట్ట చిట్టి నగర్ సొరంగం చిట్టినగర్ బంగారయ్య కొట్టు సెంటర్ వద్ద వరకు కొనసాగింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ప్రజలు పాల్గొని భారత్ మాతాకీ జై స్వతంత్ర సమరయోధులకు జై అని పెద్ద ఎత్తున నినాదిస్తూ భారీ జెండాతో ర్యాలీని ఉత్సాహభరితంగా చేసినారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని వారి త్యాగాల వల్లే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారద్రోలి భరతమాతకు స్వేచ్ఛ వాయువులు ప్రసాదించారని నేడు మనం ఈ స్వేచ్ఛ వాయులు పిలుస్తూ మనల్ని మనం పాలించుకుంటున్నామంటే ఎంతో మంది త్యాగమూర్తుల పోరాట ఫలితమని, దేశం రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగం తిండి ఇల్లు చేకూరే లాగా పాలకులు పాలన చేయాలని, కానీ ప్రజాభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి నేటి రాజకీయాల్లో ప్రతిదీ స్వార్థంతో నిండిపోయిందని పాలకులలో చిత్తశుద్ధి లోపించిందని, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అధికారం అందజేస్తే నీతి నిజాయితీతో నిబద్ధతతో అవినీతి లేనటువంటి పాలన రాబోయే రోజుల్లో ప్రజలకు అందిస్తారని అటువంటి నాయకుడికి ప్రజలు అండగా నిలబడాలని దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు పార్టీ జెండా తర్వాతనే జాతీయ జెండా పట్టుకుంటారని కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే జాతీయ జెండాను ప్రతి సందర్భంలో వారు చేతౠని కార్యక్రమాలకు హాజరవుతారని అటువంటి జాతీయత నింపుకున్న వ్యక్తికి ప్రజలు అండగా నిలబడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల వెంకటేశ్వరరావు కొరగంజి వెంకటరమణ, పొట్నూరి శ్రీనివాస్, నల్లబెల్లి కనకారావు, బొమ్ము రాంబాబు పిళ్ళా వంశి, తిరుపతి సురేష్, సిగినం శెట్టి రాము, స్టాలిన్ శంకర్, గరే మురళి, మొబీనా, వేవిన నాగరాజు,గన్ను శంకర్, తమ్మిన రఘు,రమాదేవి,బుద్ధన ప్రసాద్ శ్రీదేవి, ఎస్ ఎన్ మూర్తి, బాదర్ల శివ, బావిశెట్టి శ్రీను, పోలిశెట్టి శివా, ఏ రాజు, అఖిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …