పేరకలపాడు గ్రామంలో “మిషన్ అమృత్ సరోవర్” కార్యక్రమం

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
కంచికచర్ల మండలం లోని పేరకలపాడు గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మిషన్ అమృత్ సరోవర్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తో కలిసి శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్  చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ,ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ సరోవర్’ కార్యక్రమం అమలులో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థానం సంపాందించిందని ,ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో కూడా ప్రకటించిందని తెలిపారు. అదేవిధంగా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని , ఈ ఏడాది ఏప్రిల్ 24న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారని ,కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పది వేల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉండేలా ఈ చెరువులను నిర్మించాలని , స్థలం లేని గ్రామాలలో పాత చెరువులను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఆయా గ్రామాల్లో చెరువుల అభివృద్ధి పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టడంతో ఉపాధి హామీ కూలీలకు‌ కూడా పని దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ,జడ్పిటిసి , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *