విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శాశ్వత ఎస్సీ వర్గీకరణ కావాలి… మాదిగలది న్యాయమైన డిమాండ్. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముజి కి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ వ్రాసినట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ తెలిపారు. అదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాదిగ రాజకీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకుమర్తి చిన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత 30ఏళ్లగా అనేక ఉద్యమాలు మాదిగలు చేస్తూనే ఉన్నారు అధికార పక్షంలో ఉండగా కాంగ్రెస్ ఉసామెహర కమిషన్ అనుకూలంగా ఇచ్చిందని ఇప్పటికే దళితులకు మాదిగలకు ప్రత్యేక రిజర్వేషన్ల పేరుతో వర్గీకరణ తమిళనాడులో ఆనాటి ఉందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న బిజెపి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పెడతానని హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని అనేక సందర్భాలలో బిజెపిని నిలదీయడం జరిగింది ఆ క్రమంలోనే బిజెపి నేతలు మంత్రులు బహిరంగ సభలకు వచ్చి వర్గీకరణ బిల్లు పెడతానని హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న బిల్లు పెట్టకపోవడం మాదిగలకు ద్రోహం అని అలాగే 2020 ఆగస్టులో పంజాబ్ రాష్ట్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని 78 పేజీలలో జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు ఈ మధ్యకాలంలో తాత్కాలిక రిజర్వేషన్లని కొందరు కోర్టుకు వెళ్లి చెప్పడం జరిగిందని ఇది హాస్యాస్పదమని 2004లో సుప్రీంకోర్టు కొట్టేస్తే 2022లో సుప్రీంకోర్టుకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. జస్టిస్ ఎన్వి రమణ కూడా 2020లో ఇచ్చిన అరుణ్ మిశ్రా జడ్జిమెంట్ లోనే మీ వాదనలు వినిపించండి అని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇప్పటికే వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలు నష్టపోయారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాలని లేకపోతే మాదిగలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆకుమర్తి చిన్న మాదిగ ఆవేదన చెందారు అలాగే ఇప్పటికే ఆర్థిక రంగంలో మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ చేసిందని ఇక చేయాల్సింది విద్యా ఉద్యోగ రంగాలలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేయాలని లేని పక్షంలో రెండు తెలుగు రాష్ట్రాలు మాదిగలు దూరమయ్యే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ఈనెల ఒకటి నుంచి ఎనిమిదో తారీకు వరకు సుమారు వారం రోజులు పాటు ఢిల్లీలో కేంద్రం మంత్రులు అబ్బయ్య నారాయణస్వామి, ఎల్ మురుగన్, అర్జున్ ముండా, ముజపర్ మహేంద్ర బాయ్ అనేకమంది బిజెపి నేతలు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా అస్సాం గుజరాత్ ఎంపీలను కలిసి ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లులో ఎటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వద్దని ఇస్తే వర్గీకరణను అనుసరించి జనాభా దామాస ప్రకారం ఇవ్వాలనిలేకుంటే ఆంధ్ర తెలంగాణలో మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సామాజిక సాధికార కమిటీ అధ్యక్షులు కాండ్రు సుదాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.