విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మారుతీనగర్ లోని కోకోకోలావీధిలోని కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్ తమ్మిశెట్టి చక్రవర్తి కుటుంబ సమేతంగా పాల్గొని తొలిబోనం సమర్పించి ప్రత్యేక పూజాకార్యక్రమం నిర్వహించారు. స్థానిక మహిళలు భారీఎత్తున పాల్గొని బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భంగా తమ్మిశెట్టి చక్రవర్తి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో స్థానిక అమ్మవారికి బోనాలు సమర్పించడం అనవాయతీగా జరుగుతుందని కనకదుర్గమ్మ అమ్మవారి కరుణా కటాక్షం అందరికీ ఉండాలని కోరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి పెద వెంకటేశ్వర్లు, వేముల శివయ్య, టి. శ్రీనివాసరావు, వి.శంకర్ మరియు స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …