లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే  ప్రధమ స్థానంలో నిలిచిన ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్

-పోలీస్ కమీషనర్ ని అభినందించిన జిల్లా జడ్జ్ అరుణ సారికా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం జరిగిన మెగా లోక్ అదాలత్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రాజీ చేయదగిన కుటుంబ తగాదాలు, రహదారి ప్రమాదాలు, పెట్టి కేసులు, ఇతర కేసులను ఇరుపక్షాల సమక్షంలో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గమని, ఎక్కువ పెండింగ్ లో వున్న కేసులను మరియు అన్నికేసుల లోని ఇరుపక్షాల వారితో మాట్లాడి  ఎక్కువ కేసులు ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించే విధంగా చూడాలని ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి  తగిన సూచనలు మరియు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. న్యాయస్థానం వారు నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో నగర పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు అధికారులు మరియు సిబ్బంది కలిసి  ఎన్.టి.ఆర్.జిల్లాలో వివిధ కేసులయిన ఐ.పి.సి. కేసులు – 2592, స్పెషల్ యాక్ట్ కేసులు – 716 మరియు పెట్టి కేసులు- 8322 మొత్తం 11,630  కేసులలో ఎన్నడు లేని విధంగా పరిష్కారం  చూపడం జరిగింది. 11,630 కేసులలో కక్షిదారులు, ఫిర్యాదుదారులను, ఇరువర్గాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ వారితో మాట్లాడి వారి యొక్క కేసులను ఈ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా అత్యధిక సంఖ్యలో పరిష్కారం చూపే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎన్.టి.ఆర్.జిల్లా పోలిస్ కమీషనర్ ని అభినందించారు. న్యాయస్థానం వారు నిర్వహించిన మెగా లోక్ అదాలత్ లో రాష్ట్రంలోనే అత్యధిక కేసులను పరిష్కరించడంలో ప్రధమ స్థానం పొందిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలిస్ కమీషనర్ ని జిల్లా జడ్జ్ అరుణ సారికా అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *