Breaking News

జగనన్న పాలనలో అన్ని వర్గాలకు న్యాయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-28వ డివిజన్ 203 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మంగళవారం 28 వ డివిజన్ 203 వ వార్డు సచివాలయ పరిధిలో దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అడవిశేషగిరి రావు వీధి, మానేపల్లివారి వీధులలో విస్తృతంగా పర్యటించి.. 250 గడపలను సందర్శించారు. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ అన్ని శాఖల అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ మల్లాది విష్ణు సూచించారు. హెల్త్ సెక్రటరీలు ఇంటింటా ఫీవర్ స‌ర్వే నిర్వహించి, ప్రజ‌లంద‌రీ ఆరోగ్య వివ‌రాల‌ను ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. కాలనీలలో చెత్త సేకరణ సక్రమంగా జరగాలని.. వాహనం వచ్చే వేళలను గృహ యజమానులకు ముందుగానే తెలియపరచాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. అలాగే వర్షపు నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రెయిన్లలోకి ప్రవహించేలా ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరోగ్యశ్రీ పునర్జన్మనిచ్చింది
కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ పథకం తమకు పునర్జన్మనిచ్చిందని పలువురు స్థానికులు ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి తెలిపారు. లాక్‌డౌన్‌లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన వేళ.. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సమాజ సేవలో నిమగ్నమయ్యారని వెల్లడించారు. చికిత్స సమయంలో ఎక్కడా తాము ధైర్యం కోల్పోకుండా నిత్యం పర్యవేక్షిస్తూ.. తమను పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. కరోనాను ఆరోగ్యశ్రీ క్రిందకు తీసుకువచ్చి తమ ప్రాణాలను కాపాడినందుకుగానూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

పబ్లిక్ పల్స్ ను ప్రతిబింబించిన ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే
రాష్ట్రంలోని పేదలకు సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు.. మరో 30 ఏళ్లు ఆయనను ప్రజల హృదయాలలో ముఖ్యమంత్రిగా నిలబెడతాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇండియా టుడే – సీ ఓటర్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందని.. రాష్ట్ర ప్రజలు నెంబర్ వన్ ఛాయిస్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో నిర్వహించిన స‌ర్వేలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ కు 40 శాతం జ‌నాద‌ర‌ణ క‌నిపించ‌గా.. తాజాగా చేప‌ట్టిన స‌ర్వేలో అది 17 శాతం పెరిగి 57 శాతానికి చేరుకుందని వివరించారు. దేశంలో ప్రసిద్ధికెక్కిన రాజకీయ విశ్లేషకులు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, రాహుల్‌ కన్వల్‌ సహా పలువురు విశ్లేషకులు ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్సార్‌ సీపీకి ఎదురేలేదని, ప్రజాదరణలో వైఎస్‌ జగన్‌ కు మరెవరూ సాటిలేరని స్పష్టం చేశారన్నారు. కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డినే తమ ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని.. ఇకనైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు బురదజల్లే విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.

మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
సుధీర్ఘంగా సాగిన డివిజన్ పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాలు మరువలేనివని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇప్పటివరకు 33 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దిగ్విజయంగా పూర్తిచేసుకున్నామని.. ప్రత్యేకించి 28వ డివిజన్ ప్రజలు చూపిన ఆదరాభిమానాలకుగానూ ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు కమ్మిలి రత్న, వేదాంతం చైతన్య, చిన్నారావు, భోగాది మురళి, నాడార్స్ శ్రీను, మండా రాము, దుర్గాప్రసాద్, శనగశెట్టి హరిబాబు, మానం వెంకటేశ్వరరావు, రత్తయ్య, పేరం త్రివేణి రెడ్డి, యక్కల మారుతి, క్యాంటిన్ రెడ్డి, శీను, కాలనీ సురేష్, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *