గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి గుంటూరు నగరపాలక సంస్ధ పరిధిలో మొత్తం 207వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న35 వార్డు వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయుటకు ది.25-8-2022న అన్ని వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ల పోస్టుల వివరములను నోటీసు బోర్డుల యందు ప్రచురిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐ.ఏ.యస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డు వాలెంటీరు పోస్టునకు ధరఖాస్తుదారుడు, 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై (ఆధార్ కార్డులోని పుట్టిన తేది మరియు 10 వ తరగతి సర్టిఫికేట్ లోని పుట్టిన తేదీ ఒకటై ఉండవలెను), తేది. 1-8-2022 నాటికి 18 సంవత్సరములు నిండినవారై ఉండి, 35 సంవత్సరములు మించని వారై ఉండవలెనని తెలిపారు. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు చిరునామా సంబంధిత మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ఉండవలెనని, ది.26-8-2022 నుండి 28-8-2022 వరకు ఆన్లైన్ ద్వారా http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer 090420201049.vt వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొనవచ్చునని పేర్కొన్నారు. ది.29-8-2022 న ఆన్ లైన్ నందు దాఖలైన దరఖాస్తులను పరిశీలించి, 30-8-2022 న మౌఖిక పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయబడునని తెలిపారు. ఎంపిక కాబడిన వార్డు వాలంటీర్లు ది.5-9-2022 నుండి విధుల్లోకి చేరవలసియుండునని తెలిపారు.
Tags guntur
Check Also
“సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “సామాజిక స్పృహ కలిగించే కథలు రావాలి” , దాని వల్ల ప్రజల్లో అనేక …