Breaking News

యంపిఎఫ్‌సి గిడ్డంగుల నిర్మాణాలకు స్థల సేకరణ పనులను పూర్తి చేయండి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు పండిరచిన పంటలను నిల్వ చేసుకునే బహుళ ప్రయోజన సౌకర్యాల గిడ్డంగుల నిర్మించేందుకు అవసరమైన స్థల సేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.యంపిఎఫ్‌సి గిడ్డంగులు నిర్మాణాలపై జిల్లా స్థాయి అమలు కమిటి చైర్మన్‌ మరియు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధ్యక్షతన బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు పండిరచిన పంటలను గిడ్డంగులలో బద్రపరచుకునేలా ప్రభుత్వం బహుళ ప్రయోజన సౌకర్యాల గిడ్డంగులు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బహుళ ప్రయోజన సౌకర్యాలతో నిర్మించే గిడ్డంగులలో డ్రైయింగ్‌ ప్లాట్‌ఫారమ్‌, పాల సేకరణ కేంద్రాలు, శీతల గదులు, ప్రాథమిక ప్రాసెసింగ్‌ కేంద్రాలు, పరీక్షా పరికరాలు, జనతా బజార్‌లు, ఇ`మార్కెటింగ్‌ వంటి సౌకర్యాలు ఉంటాయన్నారు. మూడు దశలలో గిడ్డంగులను నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. మొదటి దశ కింద 58 గిడ్డంగుల నిర్మాణానికి ఇప్పటికే స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. రెండవ దశ కింద మరో 50 గిడ్డంగులను నిర్మించుకునేందుకు స్థలాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 32 గిడ్డంగులకు స్థల సేకరణ పూర్తి అయిందన్నారు. స్థల సేకరణలో వీరులపాడు మండలం పూర్తిగా వెనుకబడి ఉందని వీటితోపాటు రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాలలో స్థల సేకరణ సమస్య ఉందన్నారు. అన్ని మండలాలలో స్థల సేకరణ వేగవంతంగా పూర్తి అయినప్పటికి జిల్లా ముందంజలో ఉన్నప్పటికి కేవలం వీరులపాడు మండలంలో దాదాపు 8 గిడ్డంగులకు స్థల సేకరణ చేయకపోవడం వలన రాష్ట్ర ర్యాకింగ్‌లో జిల్లా వెనుకబడి ఉన్నట్లు గుర్తిస్తున్నారన్నారు. రెండు రోజులలో వీరులపాడు మండలంలో స్థల సేకరణ పనులను పూర్తి చేయాలని తహశీల్థార్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. స్థల సేకరణ సమస్య ఉన్న రామవరప్పాడు ప్రసాదంపాడు గొల్లపూడి, వెలగలేరు గ్రామాలలో గిడ్డంగులను నిర్మించేందుకు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలన్నారు. మూడవ దశలో మంజూరైన 18 గిడ్డంగులను నిర్మించేందుకు తహశీల్థార్లు, మార్కెటింగ్‌ అధికారులు సంయుక్తంగా స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షులు మరియు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, కన్వీనర్‌ డిస్టిక్‌ కోఆపరేటివ్‌ అధికారి సిహెచ్‌ శైలజా, మార్కెటింగ్‌ ఏడి కిషోర్‌, వివిధ శాఖలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *