-జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సా.5 గంటల వరకు వార్డు సచివాలయలలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ నుపూర్ అజయ్ అన్నారు. విజయవాడ రూల్ నున్న సచివాలయాన్ని బుధవారం జాయింట్ కలెక్టర్ ఎన్ నుపూర్ అజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి అందిన ఆర్జీలను పరిష్కార నివేధికను పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల హాజరు పట్టి, మూమెంట్ రిజిస్ట్రర్, ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెంటర్‌ను పరిశీలించారు.సచివాలయ పరిధిలో ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయాలలో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ ప్రతీ రోజు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలన్నారు. అధికారులు సైతం గ్రామ, వార్డు సచివాలయాలలో తనిఖీలు చేపడితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని అన్నారు.అధికారుల తనిఖీల ద్వారా సచివాలయాలలో ఏమైన సమస్యలు ఉంటే అవి ఉన్నతాధికారుల దృష్టికి వచ్చి పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ లక్ష్యసాధన నెరువేరుతుందన్నారు. ప్రజల నుండి అందిన ధరఖాస్తులను ఎప్పటికప్పుడు పెండిరగ్ లేకుండా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ అన్నారు.
నున్న అర్బన్ హౌసింగ్ లేఅవుట్‌ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
జగనన్న హౌసింగ్ లేఅవుట్లలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ పరిశీలించారు. లబ్ది దారులతో ముఖాముఖి మాట్లాడి గృహ నిర్మాణాలలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా లబ్దిదారులకు సహాయ సహకారాలు అందించాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ ఆదేశించారు.