-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన బడి నాడు -నేడు పథకం ద్వారా జిల్లాలో పాఠశాలల అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని 578 పనులకు గాను 478 పనులకు సంబంధించి సిఎఫ్యంఎస్ ద్వారా నిధులు విడుదల అయ్యాయని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి. రాజశేఖర్‌కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాడు- నేడు రెండవ దశ పాఠశాలల అభివృద్ధి పనులపై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి రాజశేఖర్ జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు.
కలెక్టర్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జిల్లాలో నాడు-నేడు పనుల ప్రగతిని వివరించారు. జిల్లాలో 578 అదనపు గదులను నిర్మించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని 85 అంగన్వాడీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని నిర్మాణ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి 478 పనులకు సిఎఫ్యంఎస్ ద్వారా నిధులు విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. 578 పాఠశాలల అదనపు గదులతోపాటు నేడు మరో 20 అదనపు గదులను నిర్మించేందుకు అనుమతి మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి స్థల సేకరణ చేపట్టి నిర్మాణాలకు అవసరమైన అంచనాలు తయారు చేసి పాలన పరమైన అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాల భవన నిర్మాణ పనులకు అవసరమైన ఇటుక, ఇసుక, సిమెంట్, ఐరన్, కంకర వంటి నిర్మాణ సామాగ్రిని సకాలంలో సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి వారం భవన నిర్మాణాల ప్రగతిని పంచాయతీరాజ్, విద్యా శాఖ, యంపిడివోలతో సమీక్షించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. రానున్న పిబ్రవరి మాసాంతారానికి అదనపు గదుల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలను రూపొంది అమలు చేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు ప్రిన్సిపల్ సెక్రటరికి వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిఇవో సివి రేణుక, ఐసిడిసి పిడి జి. ఉమాదేవి విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.