గ్రామీణాభివృద్ధి లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సేవలు అభినందనీయం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సేవలు ఎంతో అభినందనీయమని చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ గోరంట్ల శాఖ చీఫ్ మేనేజర్ చిలక నాగేశ్వరరావు, సీనియర్ చీఫ్ మేనేజర్ పి అమర్నాథ్ రెడ్డి, బిఎస్ఎన్ఎల్ గుంటూరు జిల్లా సలహా కమిటీ సభ్యులు మరియు విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ రాజు చలపతిరావు ల ఆధ్వర్యంలో శుక్రవారం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో బ్యాంకు వార్షిక నివేదిక పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ సర్వతోముఖాభివృద్ధి తో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి బ్యాంకులు నిర్వహిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ మేనేజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు, ఉదయ గోదావరి జిల్లాలో తమ బ్యాంకు 232 శాఖలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలకు, ప్రధానంగా రైతులకు సేవలందిస్తున్నామన్నారు. 1983 వ సంవత్సరంలో తెనాలి కేంద్రంగా ఆవిర్భవించిన తమ బ్యాంకు 2022 మార్చి నెల 31 నాటికి ఏడు వేల 287 కోట్లు డిపాజిట్లు కలిగి ఏడు వేల 393 కోట్ల రుణాలు అందజేసిందని అన్నారు. 14 వేల 680 కోట్లు వ్యాపారంతో,164 కోట్ల 34 లక్షల నికర లాభం తో తమ బ్యాంకు అభివృద్ధి పథంలో పయనిస్తుంద అన్నారు. జాతీయ బ్యాంకుల కన్నా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులలో సీనియర్ సిటీజన్ ల డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లిస్తుందన్నారు. అక్షయ టర్మ్ డిపాజిట్ పై 6.45 శాతం,6.95 శాతం వడ్డీ అందజేస్తున్నామని, తక్కువ వడ్డీతో రైతులకు వ్యవసాయ రుణాలు, గోల్డ్ లోన్ లు అంద చేస్తున్నామన్నారు. డిపాజిట్లపై అధిక వడ్డీ, రుణాలపై తక్కువ వడ్డీ కలిగిన బ్యాంకు తమదేనని, అన్ని వర్గాల ప్రజలు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిలక నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ను ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *