ఉప్పలగుప్తం, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న రంగాలలో సామాజిక సేవలు అందించిన గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్, ఉదయ్ ఇన్ ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటకు చెందిన కుంచే రమణారావుకు మదర్ థెరిస్సా జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఫిలాంత్రోపిక్ సొసైటి ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 112వ జయంతి వేడుకలను శుక్రవారం విజయవాడ హోటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమణారావును సత్కరించి మదర్ థెరిస్సా జాతీయ ప్రతిభా పురస్కారాన్ని ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా చేతుల మీదుగా అందజేశారు.
సమాజానికి సేవలు అందించడంలోనూ ప్రజల కష్టాలను తమ కష్టాలు గా భావించి సేవలు అందించడంలోనే నిజమైన తృప్తి ఉంటుందని ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా అన్నారు. కార్యక్రమంలో మదర్ థెరిస్సా జాతీయ ప్రతినిధి, అమెరికన్ యూనివర్సిటీ సౌత్ ఇండియన్ చాప్టర్ పీస్ అంబాసిడర్ డాక్టర్ అద్దంకి రాజా యోనా, సామాజిక ఉద్యమ నేత, డ్రీమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మేదర సురేష్,పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి, ఆకుమర్తి చిన్న, నెహ్రూ యువ కేంద్రం కోర్దినేటర్ వినోద్ కుమార్, ఈదా శామ్యూల్ రెడ్డి, షేక్ రసూల్, డాక్టర్ జల్లి విక్టర్ కుమార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ సామాజిక సేవకులు పాల్గొన్నారు.