నా ‘‘నేత్రాలు’’ ఒక అంధునికి ‘‘వెలుగు’’ నిస్తే నా జన్మ ధన్యం…

-నేత్రాలను అందిస్తే కుటుంబానికి భారమైన అంధుడే ఆధారవంతుడౌతాడు..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నా నేత్రాలు ఒక అంధుని జీవితంలో వెలుగును నింపితే నా జన్మ ధన్యమయినట్లేనని చూపు లేక భారమైన అంధునికి నేత్రాలను సమకుర్చాడం ద్వారా కుటుంబానికి ఆధారవంతుడవుతాడని ప్రతి ఒక్కరూ నేత్ర దానం చేసి అంధునిలో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకు ఆధ్వర్యంలో వాసవ్య మహిళ మండలి భవనం నందు నిర్వహిస్తున్న 37వ నేత్రదాన ప్రచార పక్షోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అంధత్వం అనేది భరించలేని బాద అన్నారు. ఎంతో మంది అంధులు కంటి చూపులేక చీకటి బ్రతుకుతో మరోకరిపై ఆధారపడి జీవిస్తున్నారని ప్రకృతి అందాలను చూడలేక కనీసం తన రూపాన్ని కూడా చూసుకోలేని దుర్భరమైనది అంధత్వ జీవితమన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలనేది చెప్పడం కాదని ఆచరణలో పెట్టిచూపాలనే ఉద్దేశంతో నేడు నా నేత్రాలను దానం చేస్తున్నానంటూ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తన నేత్రాలను గోరా ఐ బ్యాంకు దానం చేస్తున్నట్లు ప్రకటించి నేత్ర దాన ప్రతిజ్ఞా పత్రంపై సంతకం చేసి ఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.జి సమరం కు అందజేశారు. చూపు కోల్పోయిన వారికి మరల చూపు వస్తే వారి ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. తాను దానం చేసిన నేత్రాలు ఒక అంధుని జీవితంలో వెలుగులు నింపి ప్రపంచంలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోకరిపై ఆదారపడకుండా జీవిస్తే నా జన్మ దన్యమైనట్లేనన్నారు. చాలా మందికి రెటినా శుక్లాలు కార్నియో లెన్స్‌ వంటివి దెబ్బతినడం వలన అంధత్వం వస్తుందని మరి కొందరు అంధత్వంతోనే జన్మిస్తున్నారన్నారు. అటువంటి వారి జీవితాలలో వెలుగులు నింపడం అదృష్టంగా బావించి మరణానంతరం నేత్రాలను దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. నేత్రదానం పై ఉన్న మూడ నమ్మకాలను పారద్రోలి స్వచ్చందగా నేత్రదానానికి ముందుకు వచ్చేలా ప్రజలను చైతన్యవంతులుగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. 37 సంవత్సరాలుగా నేత్రదానం ప్రచార ఉత్సవాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ మరణించిన వారి నేత్రాలను సేకరించి అంధులకు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపుతున్న స్వేచ్ఛ గోరా ఐ బ్యాంకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తునన్నారు. జిల్లాలో అంధులను గుర్తించి జాబితాలను సిద్దం చేసి నేత్ర దానం చేసిన వారి నుండి నేత్రాలను సేకరించి తగిన సమయంలో ఆంధులకు సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఇందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందన్నారు.
స్వేచ్ఛ గోరా ఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.జి సమరం మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా సేవా దృక్పదంతో నేత్రదాన కార్యక్రమాల ద్వారా నేత్రాలను సేకరించి ఇప్పటివరకు 900 మందికి పైగా అంధులకు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపడం జరిగిందన్నారు. నేత్రదానంలో ప్రపంచంలోనే శ్రీలంక ప్రధమ స్థానంలో ఉందని మన దేశంలో ప్రజలను మరింత చైనత్యవంతులను చేయల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఏడాదిని నేత్రదాన సంవత్సరంగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 3 లక్షల 30 వేల మంది అంధులు ఉన్నారని వీరిలో 2 లక్షల 75 మందికి ఒక కన్ను అంధత్వం ఉంటే 56 వేల మంది పూర్తి ఆంధత్వంతో బాధపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. చూపులేని ప్రతి ఒక్కరికి నేత్రాలను అందించగలిగితే వారు ఇతరులపై ఆదారపడకుండా జీవితాన్ని కొనసాగించుకోగలుగుతారన్నారు. నేత్ర దాన పక్షోత్సవాల సందర్భంగా 27వ తేదిన పాఠశాలలు కళాశాలలో అవగాహన కార్యక్రమాలను, 28వ తేదిన నగరంలో ప్రచార కార్యక్రమాలను, 29వ తేదిన విద్యార్థిని విద్యార్థులకు నేత్రదానం పై వ్యాస రచన పోటీలను 30వ తేదిన చిత్రలేఖన పోటిలను సెప్టెంబర్‌ 1వ తేదిన ర్యాలీలు, 2వ తేది పాటల పోటీలు, 3వ తేది సెమినార్‌లు, 4వ తేదిన ప్రభుత్వ ప్రైవేట్‌ ఆసుపత్రులలో కరపత్రాల పంపిణీ 5వ తేదిన అంధులకు నేత్ర చికిత్స కార్యక్రమం, 6వ తేది ఆంధబాలలకు ఆటలపోటీలు 7వ తేదిన ప్రజల చైనత్య కార్యక్రమాలను నిర్వహించి 8వ తేదిన వాసవ్య మహిళ మండలి భవనం నందు ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డా.జి సమరం తెలిపారు.
తొలుత అమ్మా… మీరు నాకు కనిపించడం లేదు మిమ్మల్ని చూసేందుకు నాకేవరూ సహాయం చేయలేరా?అంటూ రూపొందించిన ే పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విడుదల చేసి నేత్ర చికిత్సలు అందిస్తున్న వైద్యులను సన్మానించారు.
కార్యక్రమంలో వాస్యవ మహిళ మండలి కార్యదర్శ జి రశ్మి , కోశాదికారి సుజాత, నేత్ర చికిత్స వైద్యులు డా. కె విజయశేఖర్‌, డా. పి ప్రభాకర్‌ శాస్త్రి, డా ఏ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *