-మంచి సమాజ నిర్మాణంలో యువై డబ్ల్యూ ఓ ముందడుగు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువై డబ్ల్యూ ఓ మూడో వార్షికోత్సవం ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువై డబ్ల్యూ ఓ రాష్ట్ర అధ్యక్షుడు నీల సురేష్ మాట్లాడుతూ సమాజానికి ఏదైనా సేవ చేయాలనే సంకల్పంతో కొంతమంది స్నేహితులతో కలిసి 2019 ఆగస్టు 28న యువై డబ్ల్యూ ఓ సంస్థను ప్రారంభించామన్నారు. నూతనంగా సిటీ ప్రెసిడెంట్ గా పాగోలు రామకృష్ణ ని ఎన్నుకోవడం భవిష్యత్‌లో మరేన్నో సేవా కార్యక్రమాలు చేయడాని తమ సంస్థ ముందుకు వస్తుందని ఆయన తెలిపారు. అన్ని గుణాలలో సేవా గుణం గొప్పదని సీనియర్ పాత్రికేయులు నిమ్మ రాజు చలపతి రావు పేర్కొన్నారు. తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న వ్యక్తులను దారా కరుణశ్రీ అధ్యక్షులు, అమృతహస్తం, నిమ్మరాజు చలపతిరావు సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, డాక్టర్ యన్. ధరణి కుమార్, వైద్యరంగం, డా.వెంగళ జగదీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పివిపి సిద్ధార్థ కళాశాల, యం.ఆర్.వి. ప్రసాద్ (రాజా), ప్రముఖ రంగస్థల నటులు, మన్నె శ్రీనివాసరావు , ప్రముఖ రచయిత, కోట అజయ్ బాబు, చరిత్ర అద్యాపకులు, ఎస్.ఆర్.ఆర్ & సివిఆర్ కాలేజి, తురక వీరయ్య, డైరెక్టర్, జి.వి.ఆర్. కాంపిటిషన్స్, యువై డబ్ల్యూ ఓ సంస్థ వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువై డబ్ల్యూ ఓ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.