దేవినేని నెహ్రూ పేరు నిలబెట్టేలా సామాజిక సేవ కార్యక్రమాలు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆండగా నిలబడుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకొని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం 11వ డివిజన్, పంటకాలువ రోడ్డు వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన దివ్యంగులు అప్పన్న కు 15వేల రూపాయలు విలువ గల తోపుడు బండిని,వృద్ధులు అయిన సుబ్బారావు కు 20వేల రూపాయల విలువ గల ఇస్త్రీ బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ అందజేశారు. అదేవిధంగా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వైస్సార్సీపీ కార్యకర్త ముంగి శ్రీను వైద్య ఖర్చులకు మరియు మౌనిక, గీతికా ల విద్య ఖర్చుల కోసం స్థానిక నాయకులు పర్వతనేని పవన్, చిమాట బుజ్జిలు తమ సొంత నిధుల నుండి ఇచ్చిన 30వేల రూపాయలను అవినాష్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఎవరికి సాధ్యం కాని విధంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన ప్రజా నాయకుడు స్వర్గీయ దేవినేని నెహ్రూ అని అంతగా పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయులు అని వారి పేరు నిలబెట్టేలా విజయవాడ నగరంలో అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. దేవినేని నెహ్రూ చివరి వరకు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతికి కృషి చేశారని నేడు వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా సేవ కార్యక్రమాల నిరంతరం వారి ఆశయసాధనకు పాటుపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు చమటా బుజ్జి, దుర్గా ప్రసాద్, చక్రవర్తి, చందు, చోటు, లక్ష్మీ, షోకాత్, విజయ్,మోహన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ను సందర్శించి రెండవ వైపు రక్షణ గోడ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండవ వైపు రక్షణ గోడకు 135 కోట్ల రూపాయలు మంజూరు చేయడం శుభపరిణామం అని వీలైనంత త్వరగా ఆ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు. తదనంతరం రాణిగారితోటకు చెందిన అవులమ్మ,ఉల్లికొండ లు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అవినాష్ తమ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి వైద్య ఖర్చులు నిమిత్తం 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *