-డ్రెయిన్స్ ద్వారా వర్షపునీరు సక్రమముగా ప్రవహించునట్లుగా చర్యలు చేపట్టాలి…
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్,
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని 42వ డివిజన్ లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస రావు, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి లతో కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీ మొదలగు ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు సంబందించి డోర్ టు డోర్ చెత్త సేకరణ తీరును అడిగితెలుసుకొన్నారు. ప్రధాన వీధులలో రోడ్ స్విప్పింగ్ పూర్తి అయిన వెంటనే అంతర్గత రోడ్లు శుభ్ర పరచి 100 శాతం నివాసాల నుండి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బంది ఆదేశించారు. అదే విధంగా సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు. డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని మరియు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తదుపరి 56 వ డివిజన్ పాతరాజరాజేస్వరి పేట లో నేడు కురిసిన వర్షపు నీరు కాలువల ద్వారా ప్రవహించకుండా రోడ్ల మీద నిల్వ ఉండుట గమనించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళికా విభాగము వారు సమన్వయంతో పని చేసి రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి మ్యాన్ హోల్, కల్వర్ట్ మూతలు తీసి శుభ్రపరచి, నీటి పారుదల సక్రమముగా ఉండునట్లుగా చూడాలని ఆదేశించారు. అదే విధంగా పారిశుధ్య నిర్వహణకు అవరోధoగా కాలువల మీద ఆక్రమణలను తొలగించుట, డ్రెయిన్స్ నందు పూర్తి స్థాయిలో సిల్ట్ తొలగించుట, కాలువలలో చెత్త వ్యర్ధపదార్దములు పడకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ రావు, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్, అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.