వ్యావహారిక భాషోద్ధారకుడు గిడుగు వెంకట రామమూర్తి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయలు కీర్తించిన తెలుగు భాషను.. గ్రాంథికం నుంచి వాడుకకు తీసుకొచ్చిన మహనీయులు గిడుగు వెంకట రామ్మూర్తి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవహార భాషా ఉద్యమ కర్త గిడుగు రామ్మూర్తి  చిత్రపటానికి ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనం నందు సోమవారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి గిడుగు అందించిన సేవలను కొనియాడారు. గ్రాంథిక భాష రాజ్యమేలుతున్న రోజుల్లో వాడుక భాషోద్యమానికి వెన్నుదున్నుగా నిలిచిన కవి గిడుగు రామ్మూర్తి అని కీర్తించారు. నాలుగు దశాబ్దాలకు పైగా గ్రాంథికవాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టారన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు వెంకట రామమూర్తి ఒకరు అని చెప్పుకొచ్చారు. గిడుగు వంటి ఎందరో భాషా ప్రేమికులు, కవులు, రచయితలు ఇచ్చిన స్పూర్తితోనే.. తెలుగు భాషలోని తీయదనాన్ని నవతరానికి, భావితరాలకు అందించడం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఇసరపు రాజారమేష్, కాళ్ల ఆదినారాయణ, చల్లా సుధాకర్, లంకా బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *