Breaking News

సామరస్య వాతావరణంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించేలా చర్యలు…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సామరస్యపూర్వకమైన ప్రశాంత వాతావరణంలో వినాయ చవితి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు.
ఈనెల 31వ తేది నుండి నిర్వహించనున్న వినాయక చవితి వేడుకలలో వినాయక పందిళ్ల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సోమవారం కలెక్టరేట్‌ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఏడాది జిల్లాలో వినాయక పందిళ్లను ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తుందన్నారు. గత రెండు సంవత్సరాలు కోవిడ్‌ కారణంగా నిబంధనలను విధించడం జరిగిందని అయితే ఈ ఏడాది ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుపై ఎటువంటి నిబంధనలు విధించలేదని ప్రజలు స్వేచ్చగా గణేష్‌ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఉత్సవాలను నిర్వహించుకోవచ్చునన్నారు. ఉత్సవ నిర్వహుకులు పోలీసుల నుండి అనుమతి తీసుకోవాలన్నారు. పందిళ్లు వద్ద ఎటువంటి ఘర్షణలు తలఎత్తకుండా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. పందిళ్లలో ఏర్పాటు చేసే విద్యుత్‌ అలంకరణవలన షార్ట్‌ సర్కూట్‌లకు తావులేకుండా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. నగరంలో సుమారు 900 విగ్రహాలు, గ్రామీణ ప్రాంతాలలో 600 వరకు విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పోలీస్‌ అధికారుల వద్ద అనుమతులు తీసుకున్నట్లు సమాచారం ఉందన్నారు. వీటితోపాటు మదిర, ఖమ్మం ప్రాంతాల నుండి మరో 200 విగ్రహాలకు పైగా నిమజ్జనం చేసేందుకు నగరానికి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనానికి అవసరమైన క్రేయిన్‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ప్రకాశం బ్యారేజ్‌కి ఎగువ నుండి వరద నీరు చేరుతున్నందున నిమజ్జనం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనానికి ఏర్పాటు చేసిన ప్రదేశాలలోనే కాకుండా కాలువలు నదీ పరివాహక ప్రాంతాలలో విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంటాయని అటువంటి ప్రదేశాలలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ తెలిపారు. నిమజ్జనం ప్రాంతాల వద్ద గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచాలని మత్స్య శాఖ అధికారులను, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. విగ్రహాలు వినాయక పందిళ్ల వద్ద నిమజ్జనం చేసే ప్రదేశాలలో పారిశుద్ద్య కార్మికులను ఏర్పాటు చేసి నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌, కార్పొరేషన్‌ తదితర శాఖల అధికారులు మంగళవారం నిమజ్జనం ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.
సమావేశంలో డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, ఏసిపి కె. హనుమంత్‌రావు, డియంహెచ్‌వో డా.యం సుహసిని, వియంసి ఎస్సీ డి. నరసింహామూర్తి, విద్యుత్‌, మత్య్స, జలవనరులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *