విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను సాద్యమైనంత త్వరగా పరిష్కరించి స్పందన కార్యక్రమంపై ప్రజలలో విశ్వాసం కలిగించే విధంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. స్పందనలో స్వీకరించిన ఆర్జీలపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి స్పందన వేదిక ఒక చక్కని మార్గమని నమ్మిన ఆర్జీదారులకు స్పందన పై విశ్వాసం కలిగించాలని కలెక్టర్ అన్నారు. ప్రతి పౌరుడు ఇచ్చిన ఆర్జీలను కూలంకుషంగా పరిశీలించి వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యకు సరైన మార్గం చూపించాలన్నారు. ఆర్జీదారుడు ఇచ్చిన ప్రతి ఆర్జీపై అధికారులు ఆలోచించి తమ భాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో 102 అర్జీల నమోదు అయ్యాయని కలెక్టర్ తెలిపారు.
స్పందనలో వచ్చిన ఆర్జీలు:
విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామానికి చెందిన డి ప్రసాద్ ఆర్జీ ఇస్తూ తనకు గొల్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఎకరం 51 సెంట్ల భూమి ఉందని దానికి సరిహద్దులు నిర్ణయించి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని ఆర్జీ సమర్పించారు.
తిరువూరుకు చెందిన సిహెచ్ హేమలత ఆర్జీ ఇస్తూ తన సొంత రిజిస్ట్రర్ భూమిని కబ్జా చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, ఆర్‌డివో కె.మోహన్‌కుమార్, డిపివో జె.సునీత, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు రామలక్ష్మి, భాను, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.