విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో సద్గురు యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎస్.కె.మూర్తి రచించిన ‘యోగ బాలశిక్ష పుస్తకం, ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఆదివారం సూర్యారావుపేటలోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని సంఘం గౌరవ అధ్యక్షుడు మొవ్వ ఆనంద్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఆడియోను లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గోకరాజు గంగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ‘యోగ బాలశిక్ష పుస్తకం విద్యార్థులు, యువత, మధ్య వయసుల వారికి, వృద్ధులకు ఉపయోపడుతుందన్నారు. ఇది యోగ మాత్రమే కాదని అన్ని తరాలు, మతాలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. ఏడుగురు నిపుణులు యోగ నిద్ర, చక్రధ్యానం, ఓం ధ్యానం గురించి ఆడియో రూపంలో వివరించారని తెలిపారు. రచయిత కె.వి.ఎస్.కె.మూర్తి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఏం కావాలో.. అంటే డిప్రెషన్ నుంచి బయట పడటం, గృహ వైద్యం, ఆయుర్వేద రహస్యాలు, నాటు వైద్య చిట్కాలు, నిత్యం తింటున్న కాయ, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, సాధారణంగా వచ్చే వ్యాధులు, యోగసనాలువంటి అంశాలను 6 భాగాల్లో వివరించానని తెలిపారు. ఇది అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి భక్తి చైతన్యానంద సరస్వతి, గోళ్ల నారాయణరావు, వైకాపా నాయకులు కొమ్మ కోట్లు, త్రిపురనేని పార్ధసారథి, డాక్టర్ మాణికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …