విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తూర్పు నియోజకవర్గ డివిజన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ మరియు కమిటీ సభ్యులు నియామకంతోపాటు ప్రమాణ స్వీకార మహోత్సవం ఆర్యవైశ్యుల ఆత్మీయ కలయిక ఆదివారం గురునానక్ కాలనీ ఎదురు, వాసవీ నగర్‌లోని వాసవీ కళ్యాణ మండపంలో జరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆర్యవైశ్య నాయకులు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో వక్తలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని, ఏ కష్ట సమయంలోనైనా మేమున్నామని చేయూతనిస్తూ ఆదుకుంటానికి ఎల్లవేళలా అందుబాటులో వుంటామన్నారు. అలాగే కళ్యాణమండప అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా వైశ్యులకు అన్ని రంగాలలో అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తూ తమ వంతు సహకారాన్ని అందజేస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుంటామన్నారు. అనంతరం నూతన కమిటీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, మహిళా విభాగం, యువజన సంఘం, సేవాదళ్, నగర ప్రముఖులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …