– ఉద్యోగ విరమణ సమావేశంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో 38 ఏళ్ల పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి గుంటూరు పట్టణ పరిధిలోని గోరంట్ల బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన చిలక నాగేశ్వరరావు సేవలు మరువలేనివని బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు అన్నారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ బుధవారం పదవీ విరమణ చేయనున్న నాగేశ్వరావు కు బ్యాంకు అధికారులు సిబ్బంది మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు సమావేశాని ఏ జె కెనడి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ అమర్నాథ్ రెడ్డి తో పాటు వివిధ బ్యాంకులు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు నాగేశ్వరావు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు ఆయన సేవలను కొనియాడారు. నేటితరం ఉద్యోగులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఓర్పుతో బ్యాంకు అభివృద్ధి తో పాటు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి మన్ననలు పొందాలని ఈ సందర్భంగా నాగేశ్వరరావు అన్నారు. తన 38 ఏళ్ల సర్వీసులో సహకరించిన బ్యాంకు యాజమాన్యానికి, అధికారులకు, సిబ్బందికి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. బ్యాంకు చైర్మన్ కామేశ్వరరావు, బ్యాంకు ఆఫీసర్స్ యూనియన్ కార్యదర్శి బోడ శ్రీనివాస్ పదవీ విరమణ చేస్తున్న నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశంలో గుంటూరు జిల్లా బిఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు, సీనియర్ జర్నలిస్టు నిమ్మల చలపతిరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు ఏకే మోహన్ రావు, నగర కమిటీ సహాయ కార్యదర్శి బి. పరస్యామ్ పాల్గొన్నారు.