విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యనారాయణ పురంలోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ లో గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గడచిన 41 సంవత్సరాల నుండి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న గుడిపాటి దత్తు సామాజిక బాధ్యతగా జలకాలుష్య నివారణకు గణేష్ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం విజయవాడలో చేపట్టారు. వారి కుమారుడు గుడిపాటి సీతారాం చేతుల మీదుగా జర్నలిస్టులకు గణేష్ మట్టి విగ్రహంతో కూడిన ఒక కిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు పాల్లొని ప్రసంగిస్తూ జలకాలుష్య నివారణకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన దత్తు, సీతారాంలను ఆయన అభినందించారు. గుడిపాటి సీతారాం మాట్లాడుతూ కమిటీ స్థాపించి 41 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విజయవాడలో 41 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్, సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు, సామ్నా రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఏపీ ఫోటో జర్నలిస్ట్స్ అధ్యక్షులు సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి రామారావు, దాసరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలిమేఘం సంపాదకుడు విన్నకోట శ్రీనివాసరావు నిర్వహణలో యూనియన్ నాయకులను సీతారాం దుశ్శాలువాలతో సత్కరించారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …