విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వై.యస్.ఆర్ చేయూత ఈ ఏడాది ఆగష్టు 12వ తేది నాటికీ 45 ఏళ్ళు నిండిన S.C, S.T, B.C, MINORITY మహిళలకు వై.యస్.ఆర్ చేయూత పధకము ద్వారా ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేయనుంది, గతములో లబ్దిపొందిన లబ్దిదారుల జాబితా సచివాలయంలో వారి యొక్క EKYC వాలంటీర్ app ద్వారా తీసుకొనుట జరుగుతుంది. కొత్తగా అర్హులైన లబ్దిదారులు గ్రామా, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదు తో పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. సెప్టెంబర్ 5వ తేది వరకు పేర్ల నమోదు ప్రక్రియ ఉంటుందని అధికారులు వెల్లడించారు.
45-60 సంIIల మధ్య వయసు వున్నా S.C, S.T, B.C, MINORITY మహిళల ఆర్ధిక సాదికారిత కొరకు సంII నకు రూ.18750/- చొప్పున నాలుగు సంవత్సరాలలో ఒక్కొకరికి రూ.75000/- లు వై.యస్.ఆర్ చేయూత పధకము ద్వారా ఆర్ధిక సహాయము అందించపడుతుంది.
BPL కుటుంబమునకు చెందిన వారు మాత్రమే అర్హులు. కొత్తగా దరఖాస్తు చేసుకొను వారు తగిన ఆధారములతో అనగా – ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, రైస్ కార్డు, కాస్ట్ సర్టిఫికేట్ (AP seva), ఇన్కమ్ సర్టిఫికేట్ (AP seva), ఎల