విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో prevention prohibition and redressal act 2013, ఈ చట్టం ప్రకారం ఎవరైతే ఉమెన్స్ ని వారు పని చేసే స్థానంలో హరస్స్మేంట్ మరియు వారిని హింసించడం జరిగితే వారు వ్రాతపూర్వకంగా గాని ఫోన్ ద్వారా గాని కంప్లైంట్ చెయ్యవచ్చు.
ఈ కమిటిని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, ఫామ్ చేశారు. ఈ కమిటిని నిర్వహణ చేసేది అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, అకౌంట్స్ సెక్షన్ సూపరింటెండెంట్ ప్రభావతి, P.సబితా Sr.Asst (ఎస్టేట్ సెక్షన్), M.నీలమ్మ (OS C.Section), 19 వ డివిజన్ డ్వాక్రా మెంబెర్ G. లక్ష్మి, S. పద్మ NGO ఈ ఏడుగురు సభ్యులు ప్రతి నెలకొకసారి మీటింగ్ నిర్వహించి వీఎంసీ ఉమెన్స్ ఎంప్లాయిస్, సచివాలయం ఉమెన్స్ ఎంప్లాయిస్, స్వయం సహాయక సంఘాల సభ్యుల పైన ఎటువంటి హరస్స్మేంట్ మరియు వారిని హింసించడం వంటి ఫిర్యాదులు ఉన్న వాటిపైన చర్యలు తీసుకొనుటకు ఈ కమిటి పని చేస్తుంది.
తదుపరి దశలో జోనల్ లెవల్ లో కుడా ఈ కమిటిను ఏర్పాటు చేయుటకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ కమిటి యొక్క మొదటి సమావేశము అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, యొక్క చాంబర్ నందు నిర్వహించడం జరిగినది. అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) మాట్లాడుతూ ఉమెన్స్ ఎంప్లాయిస్ ఎటువంటి హరస్స్మేంట్ మరియు వారిని హింసించడం వంటి ఫిర్యాదులు ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం లో ఈ ఫిర్యాదు స్వికరించడానికి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేయడం జరిగినది. ఎటువంటి హరస్స్మేంట్ మరియు వారిని హింసించడం వంటి ఫిర్యాదులు ఉన్న ఉమెన్స్ ఎంప్లాయిస్ కాల్ చేసి ప్రత్యేక కౌంటర్ యొక్క ఫోన్ నెం. 8985657183 కు ఫిర్యాదు చెయ్యవచ్చు.