గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు మంగళవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 175 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ పత్రాలు లేనందున వారి దరఖాస్తులు రిజెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం 125 మందిని అర్హులుగా ప్రకటించగా వారిలో 79 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన వారి ఫోన్ కి మెసేజ్ వస్తుందని, ఎంపిక కాబడిన వార్డు వాలంటీర్లు 5-9-2022 నుండి విధుల్లోకి చేరవలసియుండునని తెలిపారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …