విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
SC, ST, BC, మైనారిటీ వర్గాలపై నేరాలు…. అన్ని రంగాలలో ఎక్కువ శాతం మహిళలపై పెరిగాయని … హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరిగాయని నివేదిక బట్టబయలు చేసిందని తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు అన్నారు. మంగళవారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020 లో 850 హత్యలు పెరిగాయి. 2021 లో 958 చోటు చేసుకున్నాయన్నారు. అదేవిధంగా 2020లో మహిళలపై నేరాలు 9955 జరిగాయి. 2021 లో 11,083 సంఘటనలు జరిగాయన్నారు. ఇందులో 2020 లో కిడ్నాప్ లు 737. 2021 లో 835 కి పెరిగాయన్నారు. ఇన్ని సంఘటనలు ఘోరంగా జరుగుతున్నా గవర్నర్ ఎందుకు మౌనం వహిస్తున్నారన్నారు. ప్రజలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచక పాలనని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి నోరు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పోలీసుల ద్వారా వాళ్ల హక్కులను అణిచివేయడంలో జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు జగన్ మోహన్ రెడ్డికి దాసోహం అయ్యారని విమర్శించారు. నారా చంద్రబాబునాయుడు గురించి విమర్శించే అర్హత వైయస్సార్ పార్టీ కి లేదన్నారు. వైయస్సార్ పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ కు పర్మిషన్ తీసుకోవాలని అనడం ఎంత వరకు సబబు అని అన్నారు. 2024లో ప్రజలు మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారన్నారు.
విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు MD ఇర్ఫాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిన్నా మొన్నా మహిళలపై జరిగిన హత్యాకాండ, దోపిడీల సంఘటనలపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఈ సమావేశంలో సీనియర్ పార్టీ నాయకులు కామా దేవరాజు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తుప్పాకుల రమణమ్మ, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దాసరి జయరాజు,35వ డివిజన్ అధ్యక్షులు బూదాల నందకుమారి, తెలుగుదేశం నాయకులు పేరం సత్యనారాయణ, దోమకొండ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.