విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి సందర్భంగా నగరంలోని ఎంజీ రోడ్‌నందు గల అరస విల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద, బందరురోడ్డు, మొగల్రాజపురం, పలు కూడలి ప్రాంతాలలో అధినేత అరసవిల్లి అరవింద్ ఆద్వర్యంలో సుమారు 500 ఎకో ఫ్రెండ్లీ, వినాయకుని మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీచేశారు. గతంలో కూడా ట్రస్ట్‌ద్వారా నగ రంలో పలు చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అన్నార్తులకు భోజన పాకెట్స్ పంపిణీ, ఉచిత కంటి శిబిరం, ఉచిత వైద్య శిబిరంవంటి ఎన్నో కార్య క్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సంద్భంగా ట్రస్ట్ అధినేత అరవింద్ మాట్లాడుతూ ప్రజలంతా పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి విగ్రహాలను వాడాలని ఆకాంక్షిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …