వినాయకుని విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయకుని విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్  సూచించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ నిమజ్జనాల సమయంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏవిధమైన ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహ నిమజ్జనం చేయు సమయంలో ఉత్సవ కమిటి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోని ఎటువంటి అపశ్రుతులు జరగకుండా అధికారులతో సహకరించి వారి యొక్క సూచనలు పాటించాలన్నారు. కృష్ణా నది ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ దిగువన, శనేశ్వర గుడి ప్రక్కన విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తుందని, దీనిలో భాగంగా నదిలో విగ్రహాలు నిమజ్జనం చేయుటకు అవసరమగు క్రేన్లు మరియు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరిసరాలలో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ విధానము చేపట్టి నదిలో వ్యర్థములు పడవేయకుండా చెత్త తరలించు వాహనాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. నగరములో విగ్రహ నిమజ్జనములు ఇక్కడ తప్ప, మరో చోట చేసిన వారపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసినారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్న దృష్ట్యా , నిమజ్జన చేయు సమయంలో ప్రజలు ఎవరినీ నీళ్ళలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచాలని సూచించారు, విగ్రహ నిమజ్జనం చేయు సమయంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి అపశ్రుతులు జరగకుండా అధికారులతో సహకరించి వారి యొక్క సూచనలు పాటించాలని తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *