విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ వర్ధంతి సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లు లో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. తదనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన సామాజిక సేవా కార్యక్రమలను ప్రారంభించారు. ఆయా డివిజన్లలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యాక్రమాలు అవినాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి పాలనకు కేరాఫ్ అడ్రస్ గా వైస్సార్ పాలన సాగిందన్నారు. వైస్సార్ పాలనలో పేద ప్రజలు అందరు సంతోషంగా జీవించారన్నారు. ఆరోగ్య శ్రీ,ఫీజ్ రిఎంబర్స్మెంర్,పావలా వడ్డీ లాంటి ఎన్నో పథకాలకు రూపకల్పన చేశారన్నారు. పేదల గుండెల్లో వైస్సార్ చిరస్థాయిగా జీవించే ఉంటారన్నారు. వైస్సార్ వారసుడిగా సీఎం జగన్ పాలన చేస్తూ పేద ప్రజల మన్ననలు చూరగొంటున్నారన్నారు. ఆనాడు వైస్సార్, ఈనాడు జగన్ పేదల కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారారన్నారు. ప్రతిపక్ష టీడీపీ పని పాట లేని ఆరోపణలు ప్రభుత్వం పై చేస్తుందన్నారు. టీడీపీ చెప్పుకోవడానికి ఒక్క పధకం కూడా లేదన్నారు. వైస్సార్ కి విజయవాడతో, కృష్ణ జిల్లా తో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. దేవినేని నెహ్రూ తో వైస్సార్ ఎంతో సన్నిహితంగా ఉంటూ జిల్లా అభివృద్ధి కి పూర్తిగా సహకారం అందించే వారన్నారు. వైస్సార్ లేని లోటు ఎవరు తీర్చలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు చింతల సాంబయ్య, తంగిరాల రామిరెడ్డి, పుప్పాల కుమారి, తాటిపర్తి కొండారెడ్డి, వైస్సార్సీపీ ఇంచార్జిలు గల్లా పద్మావతి, మాగంటి నవీన్, పర్వతనేని బాబీ, వల్లూరి ఈశ్వర ప్రసాద్ మరియు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …