ఆర్‌బికేల ద్వారా రైతుకు వ్యవసాయంపై భరోసా కల్పించేలా సేవలందించండి….

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుకు వ్యవసాయ రంగంపై భరోసా కల్పించి పండిరచిన పంటకు కిట్టుబాటు ధర కల్పించలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతంగానికి అవసరమైన సేవలందించి రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నెరవేర్చాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో 27 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు రైతుభరోసా కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్‌లు ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించి వ్యవసాయం పై భరోసా కల్పించేలా అధికారులు సిబ్బంది సేవలందించాలన్నారు. జిల్లాలో 260 రైతు భరోసాకేంద్రాలు మంజూరు అయ్యాయని ఇప్పటికే 74 భవనాలు పూర్తి అయిందన్నారు. మరో 184 భవనాలను డిసెంబర్‌ మాసాంతరానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.21.80 లక్షల రూపాలయలు గ్రామీణ ఉపాధి హామి నిధులు మరో 5.20 లక్షల రూపాయల మండల పరిషత్‌ నిధులతో రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతు చేపట్టిన ప్రతి పంటను సర్వే నంబర్‌తో సహా ఇ`క్రాప్‌లో నమోదు చేయాలన్నారు. రైతుకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంచాలన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతులను పాటించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. రైతంగానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రైతుభరోసా కేంద్రాలలో ఎప్పటికప్పుడు ఉంచాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. ప్రతీ ఏడాది మూడు విడతల్లో రైతులకు రైతుభరోసా కింద ఒక్కొక్కరికి 13,500 రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందింస్తోందన్నారు. రైతు భరోసాతో పాటు రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ, ఉచిత పంట భీమా, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ, సూక్ష్మసెద్యం, పండ్ల తోటల అభివృద్ధికి సహాయం అందించి రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ శాస్త్రవేతల సలహాలు, సూచనలను పరిగణంలోనికి తీసుకుని ఎరువులు క్రీమి సంహారక మందులను సకాలంలో వినియోగించాలని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, దాన్యం కొనుగోలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌, అక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ, సూక్ష్మ సెద్యం, పంటతోటల అభివృద్ధి, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం, విత్తనాల సబ్సిడీ వంటి పథకాల ద్వారా రైతన్నలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 1,27,823 కోట్ల రూపాయలు లబ్ది చేకూర్చారన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు పంట వేసిన నాటి నుండి పంటను అమ్ముకునే ప్రక్రియ వరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా పూర్తి సహకారం అందింస్తున్నామన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సబ్బిడీపై విత్తనాలను సరఫరా చేయడం జరిగిందని అవసరమైన ఎరువులు పురుగుమందులు ఆర్‌బికేల ద్వారా సరఫరా చేసేందుకు ఎప్పటికప్పుడు సిద్దంగా ఉంచడం జరిగిందని వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు.
కార్యక్రమంలో డ్వామా పిడి జె. సునీత, ఏయంసి చైర్మన్‌ కారంపూడి సురేష్‌, మండలాధ్యక్షురాలు చెన్ను ప్రసన్నకుమారి, ఉపాఅధ్యక్షులు వేమూరి సురేష్‌, జడ్పిటిసి కె. సువర్ణరాజు యంపిడివో బి. భార్గవి, తహాశీల్థార్‌ శ్రీనివాస్‌నాయక్‌, పంచాయతీరాజ్‌ ఇఇ ఏ వెంకటేశ్వరరావు, డిఇ బి.సుధ, ఏఇ ఎన్‌ శివరామకృష్ణ, మండల వ్యవసాయ అధికారి కె. రంగనాధ్‌, రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *