విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా మహోత్సవాలలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తుల మనోభాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
దసరా ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా దేవాలయ అధికారులతో కలిసి ఉత్సవ ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి పాంత్రం నందు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అనంతరం మోడల్ గెస్ట్‌హౌస్ నందు మీడియా ప్రతినిధులతో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 26 తేది నుండి నిర్వహించనున్న కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవ ఏర్పాట్లు చేసేందుకు సంబంధిత అధికారులతో ఇంద్రకీలాద్రి ప్రాంతంలో పర్యటించడం జరిగిందన్నారు. అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రల నుండి వేలాదిమంది భక్తులు తరలివస్తారన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన దర్శనం ఏర్పాట్లు చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాట్లను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏర్పాట్ల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ఘాట్ రోడ్డును సగభాగం క్యూలైన్‌లకు మరో సగభాగం విఐపిల దర్శనానికి వినియోగించడం జరిగిందన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే విఐపిలు వివిఐపిలకు కనకదుర్గానగర్ ద్వారా లిప్టు మార్గంలో అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసి ఘాట్‌రోడ్డులో కేవలం భక్తుల దర్శనానికి సంబంధించిన క్యూలైన్‌లను మాత్రమే వినియోగిస్తే సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలతో సాద్యాసాద్యాలను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. ఈ విషయంపై మరోకసారి పూర్తి స్థాయిలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమమని అమ్మవారిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ సహృదయంతో సహకరించి వీలైనంత మంది ఎక్కువ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కొట్టి సత్యనారాయణ కోరారు.
జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ మంత్రి సామన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శన కల్పించాలనే ఆలోచన అభినందనీయమన్నారు. గతంలో ఘాట్ రోడ్డు నండి విఐపిలకు అమ్మవారి దర్శనం కల్పించడంలో ఓం టర్నింగ్ నుండి ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేయడం జరిగేదన్నారు. ఇందువలన విఐపిల రాకపోకల సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందికలిగేదని దానిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది లిప్టు మార్గం ద్వారా విఐపిలకు దర్శన ఏర్పాట్లను చేయడంపై సాద్యాసాద్యాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోనున్నామన్నారు. ఇటువంటి ఏర్పాట్ల వలన ఎదురయ్యే ఇబ్బందులను ఏవిధంగా అధిగమించాలనే విషయంపై ప్రజా ప్రతినిధులు, దేవాదాయ, పోలీస్, రెవెన్యూ తదితర శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించి తదుపరి సమావేశం నాటికి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ గతంలో కోవిడ్ కారణంగా భక్తుల సంఖ్యను నియంత్రించడం జరిగిందని కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ప్రతి రోజు వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చే అవకాశం ఉందన్నారు. మూలానక్షత్రం శుక్ర శని ఆదివారాలలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోనున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆలోచనలను ఆచరణలో పెట్టి అమ్మవారి దర్శనానికి విచ్చేసే ప్రముఖలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేపడతామని దీనితో పాటు సామాన్య భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుని విజయవంతంగా ఉత్సవాలను నిర్వహించుకునేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని కాంతి రాణా టాటా వివరించారు.
క్షేత్ర స్థాయి పర్యటనలో దేవాదాయ కమీషనర్ హరి జవహర్‌లాల్ ఆలయ ఇవో దర్భముళ్ళ భ్రమరాంబ, ఏసిపిలు హనుమంత్‌రావు, డిసిపిలు లక్ష్మీపతి, శ్రీనివాస్‌రావు, ఆలయ ఇఇలు కోటేశ్వరరావు, రమాదేవి తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …